Breaking News

Daily Archives: July 24, 2024

కేజీబీవీ విద్యార్థినిలకు ఏఎన్ఎంలే తల్లిదండ్రులు

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినిల ఆరోగ్యం, భద్రత పరంగా నిరంతరం సేవలు అందిస్తున్న ఏఎన్ఎంలు విద్యార్థులకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ అని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు కొనియాడారు. బుధవారం సమగ్ర శిక్షా, ఎయిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో కేజీబీవీల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్ఎంలకు ఐదు విడతలుగా మూడు రోజుల పాటు శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఎయిమ్స్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్ ప్రొ. డా. …

Read More »

ఢిల్లీలో ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో వేలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, రుహుల్లా మరియు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.

Read More »

టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ బాధితులు

-వినతులు స్వీకరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ -భూముల సమస్యలపైనే అత్యధిక అర్జీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వీటిల్లో అత్యధిక భాగం గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన భూ అక్రమణలు, …

Read More »

వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు కనీ వినీ ఎరుగని రికార్డు స్థాయికి చేరాయి

-వైసీపీ ప్రభుత్వ అండదండలతో వైసీపీ నాయకులు భూ ఆక్రమణలతో చెలరేగిపోయారు. -భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అన్ని వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వం లో చతికిల పడ్డాయి. -వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులు సైతం దగా పడ్డారు. -సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చే ప్రతి వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందిస్తారు -రెవిన్యూ శాఖ మంత్రి అనగానీ సత్య ప్రసాద్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు “ప్రజా …

Read More »

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి

– త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డుతూ మ‌రో ప‌దిమందికి ఉపాధిచూపే స్థాయికి చేరాలి – కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ – మ‌హిళా సార‌థ్య ప‌రిశ్ర‌మ‌ల‌పై సెర్ప్‌-డీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలో మేధోమ‌థ‌న స‌ద‌స్సు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదాయ సృష్టితో ఆర్థిక సాధికార‌త దిశ‌గా న‌డిపించే ల‌క్ష్యంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాల‌ను మ‌హిళ‌లు స‌ద్వినియోగం చేసుకొని పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న సూచించారు. బుధ‌వారం న‌గ‌రంలోని తుమ్మ‌ల‌ప‌ల్లి …

Read More »

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్….. డా. జి. సృజన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ తనిఖీలలో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును బుధవారం జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన పరిశీలించారు. గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణ భద్రత కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపించవలసి …

Read More »

బేటీ బచావో, బేటీ పడావో పధక లక్ష్యాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలి

-లింగ వివక్షతకు తావు లేకుండా పౌరులకు అవగాహన కల్పిద్దాం. -ఆడపిల్లను రక్షించండం, చదివించడం, వారి సంక్షేమమే బేటీ బచావో, బేటీ పఢావో  పథకం ముఖ్య లక్ష్యం -బాల్యవివాహాలు నియంత్రణ పై పూర్తిస్థాయిలో ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలి. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : లింగ వివక్ష లేని సమాజం, మహిళా సాధికారత దిశగా భారత ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జిల్లా …

Read More »

ఆవ ఇళ్ల పట్టాల స్థలాలు పరిశీలన

-కలెక్టర్ ప్రశాంతి మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ఆవా భూములలో గృహ లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణి పై ప్రజా ప్రతినిధులు తెలియ చేసిన అంశాల నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం కాపవరం , బురుగుపూడి గ్రామాల్లో అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పంపిణీ పథకంలో భాగంగా ఆవ ప్రాంతంలోని కాపవరం, బూరుగు పూడి గ్రామాల్లోని 361 …

Read More »

ఈవిఎం గోడౌన్ వద్ద నిరంతర నిఘా పటిష్టమైన భద్రత ఉండాలి

-ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు సంబంధించి పోల్ అయిన ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24×7 నిరంతరం పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండాలని, డిఫెక్టివ్ ఈవిఎం లు ఎన్నికలలో వాడనివి బెల్ బెంగళూర్ కు కట్టుదిట్టమైన భద్రత నడుమ తీసుకెళ్ళాలని తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు నెల …

Read More »

తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుభం భన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా నేటి బుధవారం ఉదయం శుభం భన్సల్ జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు …

Read More »