-లింగ వివక్షతకు తావు లేకుండా పౌరులకు అవగాహన కల్పిద్దాం.
-ఆడపిల్లను రక్షించండం, చదివించడం, వారి సంక్షేమమే బేటీ బచావో, బేటీ పఢావో పథకం ముఖ్య లక్ష్యం
-బాల్యవివాహాలు నియంత్రణ పై పూర్తిస్థాయిలో ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలి.
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
లింగ వివక్ష లేని సమాజం, మహిళా సాధికారత దిశగా భారత ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో బేటీ బచావో, బేటీ పఢావో, బాల్యవివాహాలు నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ వంటి కార్యక్రమాలు అమలపై కలెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి సమీక్షిస్తూ , మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆడపిల్ల రక్షణ , ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ప్రజలకి అవగాహన కల్పించడం, బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా పథకం యొక్క లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా బేటీ బచావో, బేటీ పఢావో, బాల్యవివాహాలు నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ అంశాలపై ప్రతి గ్రామంలో వర్క్ షాప్ లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో బేటి బచావో బేటి బడావో, బాల్య వివాహాలు నియంత్రణపై పాఠశాలల్లో, కమ్యూనిటీ సెంటర్స్ వంటి జన సమూహం గల ప్రాంతాల్లోఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు జరిగే సమాచారం క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి తెలుసుకునే అవకాశం ఉందని, సామాజిక బాధ్యతతో అటువంటి వాటిని బహిర్గతం చెసేలా ప్రతీ ఒక్కరికీ అవగాహనా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం విస్తృత ప్రచారంలో భాగంగా టేబుల్ స్టాంప్స్, పోస్టర్స్, కరపత్రాలు, వార్త పత్రికలు, సోషల్ మీడియా వంటి వివిధ మాధ్యమాలు ద్వారా ప్రచారం చేసే విధంగా చర్య చేపట్టాలన్నారు.
గృహ హింస కేసు సంబంధించి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మండల కేంద్రాల్లో తాహసిల్దార్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, మహిళా పోలీస్, గ్రామస్థాయి సిబ్బందితో మహిళల, బాలికల రక్షణ, హక్కులకు చెందిన చట్టంపై అవగాహన కల్పించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. విస్తృత ప్రచారంలో భాగంగా సెమినార్స్, వర్క్ షాప్స్, ఎగ్జిబిషన్స్, ర్యాలీలు, వక్తలు ప్రసంగాలు, ఇతర శాఖల సమన్వయంతో దేవాలయాలు, చర్చి ప్రదేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. ప్రదర్శనలు ద్వారా ప్రజలకు ఆ పథకం ద్వారా సాధించిన విజయగాధలను తెలియజేసే విధంగా ప్రచార కార్యక్రమాలు ఉండాలన్నారు. జిల్లాలో 1556 అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహిస్తున్న నెలసరి పనితీరు పై సమీక్షలు పక్కగా నిర్వహించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. శాఖా పరంగా నిర్వహిస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలను క్యాలెండర్ రూపంలో ముందస్తుగానే నిర్ణయించి ఆయా తేదీల్లో అవగాహన సమావేశాలను నిర్వహించాలన్నారు. అంగన్వాడి, మండల కార్యాలయ కేంద్రాల్లో గల కాలి స్థలాల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె. విజయ కుమారి , సిడిపిఓలు , సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News