తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుభం భన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా నేటి బుధవారం ఉదయం శుభం భన్సల్ జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. జెసి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎఓ జయరాములు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నూతన జెసి గారికి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *