ఈవిఎం గోడౌన్ వద్ద నిరంతర నిఘా పటిష్టమైన భద్రత ఉండాలి

-ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు సంబంధించి పోల్ అయిన ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24×7 నిరంతరం పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండాలని, డిఫెక్టివ్ ఈవిఎం లు ఎన్నికలలో వాడనివి బెల్ బెంగళూర్ కు కట్టుదిట్టమైన భద్రత నడుమ తీసుకెళ్ళాలని తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు నెల వారీ తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు పోల్డ్ ఈవీఎం లను భద్ర పరచబడిన గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీల సమక్షంలో గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఎన్నికలలో వాడని డిఫెక్టివ్ బ్యాలెట్ యూనిట్లు 160, కంట్రోల్ యూనిట్లు 49, 124 వివిప్యాట్ లను శ్రీకాళహస్తి డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు వెంట కట్టుదిట్టమైన ఎస్కార్ట్ భద్రత నడుమ డిజిటి వాహనంలో బెల్ కంపెనీ బెంగుళూరు కు పంపుతున్నామని కలెక్టర్ తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో ఎక్కడైనా లీకేజీల ఉన్నాయా అని, పోల్ అయిన ఈవిఎం ల సీల్ లు యథా తథంగా ఉన్నాయా లేదా అని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. సెంట్రల్ వేర్ హౌసింగ్ సొసైటీ మేనేజర్ రమేష్ బాబు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎస్డిసి మరియు ఈవిఎం గోడౌన్ ఇంఛార్జి కోదండ రామిరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, ఎలక్షన్ డిటి పవన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *