Breaking News

Monthly Archives: July 2024

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది 03.08.2024

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జూలై నెల రెండవ తారీఖున నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు నెల మూడో తేదీ తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరగదని, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంతవరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3 వ తేదీ నుండి 20 వ …

Read More »

కమిషనర్ కీర్తి చేకూరి సేవలు అభినందనీయం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర కమిషనర్ గా పూర్తి సంతృప్తిగా విధులు నిర్వహించామని, తమ విధి నిర్వహణలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేశామని ఏపి ట్రాన్స్కో జెఎండిగా బదిలీ అయిన కీర్తి చేకూరి అన్నారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో బదిలీ అయిన కీర్తి చేకూరికి అధికారులు, ప్రజా ప్రతినిధులు వీడ్కోలు, అభినందన సభ నిర్వహించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ అధ్యక్షతన జరిగిన సభలో కీర్తి చేకూరి మాట్లాడుతూ …

Read More »

మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలి – సీ.ఐ.డీ ఎస్పీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతగా ముందుకు రావాలని, సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఎ.హెచ్.టి.యు), మహిళా సంరక్షణ విభాగం-సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత పిలుపునిచ్చారు. ప్రపంచంలో మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత మానవ అక్రమ రవాణా మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిందని ఆమె అన్నారు. 30 జూలై 2024న జరుపుకోబోతున్న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక …

Read More »

2047 నాటికి వికసిత్‌ భారత్‌ను సాధించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలను సాధించేందుకు తీసుకొచ్చిన చారిత్రాత్మక బడ్జెట్

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రికార్డు స్థాయిలో మూడోసారి విజయం సాధించడం ఆ కలను సాకారం చేస్తుంది : కేంద్ర సమాచార & ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా.మురుగన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23న సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2024-25 చారిత్రాత్మకమైనదని, భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలను సాధించే దిశగా రూపుదిద్దుకుందని కేంద్ర సమాచార & ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ …

Read More »

వరద ముంపు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందుకుంటాం

-బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఆర్ధిక సహాయం అందచేత -జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ -529 కుటుంబాలకు రూ.15 లక్షల 87 వేలు ఆర్ధిక సహాయం -మంత్రి కందుల దుర్గేష్ పెరవలి / ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత గోదావరీ వరదలు, ఎర్ర కాలువ వరదలలో జిల్లాలో ముంపుకు గురి అయిన కుటుంబాలకు అండగా నిలిచి, జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ, 529 కుటుంబాలకు ఒకొక్క కుటుంబానికి …

Read More »

వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కాకాని తరుణ్ చేస్తున్న కృషి అభినందనీయం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫర్నీచర్‌ అందించడంతోపాటు కన్స్యూమర్ కోర్ట్ బిల్డింగ్ బాగుచేతకు మూడు లక్షల నిధుల మంజూరు కోసం నిరంతరం కృషి చేసినందుకు గానూ వినియోగదారుల అవగాహన ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఎన్టీఆర్‌ జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సభ్యులు డాక్టర్‌ తరుణ్‌ కాకానిని ‌ ఏపీ రాష్ట్ర వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ అధ్యక్షులు దొమ్మేటి శ్రీనివాస్‌, ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల కమీషన్ అధ్యక్షులు నేలపూడి చిరంజీవి, సభ్యులు A రమణ సత్కరించారు. శ‌నివారం విజయవాడ వినియోగదారుల కమీషన్ లో నూతన …

Read More »

కె.డి.సి.ఎ ప్ర‌మాణాల‌ను ప‌రిశీలించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ (కె.డి.సి.ఎ) లో క్రికెట్ నేర్చుకునే క్రికెటర్స్ మ‌రింతగా రాణించేందుకు అవ‌స‌ర‌మైన అంతర్జాతీయ ప్ర‌మాణాలు క‌ల్పిస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియంలోని కృష్ణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం సంద‌ర్శించారు. ఎంపి కేశినేని శివనాథ్ ను అసోసియేష‌న్ స‌భ్యులు శాలువాతో స‌త్క‌రించారు. అసోసియేష‌న్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు.అనంత‌రం క్రీడాకారుల‌తో కాసేపు మాట్లాడి క్రికెట్ లో నైపుణ్యం …

Read More »

నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి మ్యానిఫెస్టోలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత కల్పించారు వాటిని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ.దుర్గాప్రసాద్, కార్యదర్శి కోసూరు సతీష్ శర్మ ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రావటానికి బ్రాహ్మణులు ముఖ్య భూమిక పోషించారన్నారు, రాబోయే నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. విజయవాడ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణులు వెనుకబడిపోయారని తెలిపారు. దేవాలయ పాలక …

Read More »

పునరాస కేంద్రం చందా సత్రం లో ఉన్న వరద బాదితులను  పరామర్శించి..

-25 కిలోల బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన.. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి  వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు వరదలు కారణంగా  గోదావరి ఉదృతికి బ్రిడ్జిపేట వాసులను పునరాస కేంద్రాలకు తరలించి వారికి రు. 3 వేల రూపాయలతో పాటు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని సిటీ  శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలో వున్న చందా సత్రం పునరావాస  కేంద్రంలోని  గోదావరి …

Read More »

ఈ నెల 28 నుండి ఆగస్ట్ 2 వరకు నిర్వహించనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

-తిరుపతి జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలు -హాజరుకానున్న 3142 అభ్యర్థులు : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 28 నుండి ఆగస్టు నెల 2 వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అధికారులతో రేపటి నుండి జరగనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి …

Read More »