Breaking News

వరద ముంపు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందుకుంటాం

-బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఆర్ధిక సహాయం అందచేత
-జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ
-529 కుటుంబాలకు రూ.15 లక్షల 87 వేలు ఆర్ధిక సహాయం
-మంత్రి కందుల దుర్గేష్

పెరవలి / ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత గోదావరీ వరదలు, ఎర్ర కాలువ వరదలలో జిల్లాలో ముంపుకు గురి అయిన కుటుంబాలకు అండగా నిలిచి, జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ, 529 కుటుంబాలకు ఒకొక్క కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు .

శనివారం సాయంత్రం పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో ఆయా నిత్యావసర సరుకులను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమక్షంలో మంత్రి అంద చేశారు. ఒకొక్క కుటుంబానికి బియ్యం 25 కిలోలు, కంది పప్పు ఒక కిలో, పామ్ ఆయిల్ ఒక లీటరు, ఉల్లిపాయలు ఒక కిలో, బంగాళా దుంపలు ఒక కిలో చొప్పున ఐదు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 529 మంది కుటుంబాలకు ఒకొక్క కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందచేస్తున్నట్లు తెలిపారు. మండలాలు వారీగా నల్లజర్ల  30 కుటుంబాలు, నిడదవోలు 336 కుటుంబాలు, రాజమహేంద్రవరం అర్బన్ 163   కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందచెయ్యడం జరుగుతోంది.

మండలాల వారీగా కుటుంబాలు ..
రాజమండ్రీ డివిజన్ 233 కుటుంబాలకు..
మండలాలు వారీగా – బిక్కవోలు -5 , గోకవరం – 18 , కడియం , కోరుకొండ – 20 రాజమహేంద్రవరం అర్బన్ – 163 , రాజమహేంద్రవరం గ్రామీణ – 1 , రంగంపేట – 5 , రాజానగరం – 9 , సీతానగరం – 8 .

కొవ్వూరు డివిజన్ .. 1188 కుటుంబాలు
* చాగల్లు – 1 , దేవరపల్లి – 11 , గోపాలపురం – 13 , కొవ్వూరు – 37 , పెరవలి – 4 , ఉండ్రాజవరం – 5 , నల్లజర్ల – 40 , నిడదవోలు – 1077.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *