అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జూలై నెల రెండవ తారీఖున నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు నెల మూడో తేదీ తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరగదని, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంతవరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు జరగనున్నాయి అని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Tags AMARAVARTHI
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News