Breaking News

కె.డి.సి.ఎ ప్ర‌మాణాల‌ను ప‌రిశీలించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ (కె.డి.సి.ఎ) లో క్రికెట్ నేర్చుకునే క్రికెటర్స్ మ‌రింతగా రాణించేందుకు అవ‌స‌ర‌మైన అంతర్జాతీయ ప్ర‌మాణాలు క‌ల్పిస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియంలోని కృష్ణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం సంద‌ర్శించారు. ఎంపి కేశినేని శివనాథ్ ను అసోసియేష‌న్ స‌భ్యులు శాలువాతో స‌త్క‌రించారు. అసోసియేష‌న్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు.అనంత‌రం క్రీడాకారుల‌తో కాసేపు మాట్లాడి క్రికెట్ లో నైపుణ్యం పెంచుకునేందుకు ఎలాంటి స‌దుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ కె.డి.సి.ఎ కోసం సొంత గ్రౌండ్ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కె.డి.సి.ఎ వైస్ ప్రెసిడెంట్ బాజీ ష‌రీష్ , సెక్ర‌ట‌రీ ర‌వీంద్ర చౌద‌రి, కోశాధికారి జి.ఎన్.శ్రీనివాస్, జాయింట్ సెక్ర‌ట‌రీ శ్రీధ‌ర్, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *