Breaking News

Monthly Archives: July 2024

గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించండి

-సీపీఐ నేతలపై గత ప్రభుత్వం బనాయించిన కేసులను ఎత్తేయండి -సీఎం చంద్రబాబుకు సీపీఐ నేతల వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని సీపీఐ నేతలు కోరారు. ఒక్క కడప జిల్లాలోనే వేలాది ఎకరాల కబ్జాకు గురయ్యాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనంపై విచారణ చేయాలన్నారు. మూడు రాజధానుల పేరుతోనూ విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో వేలాది ఎకరాలు …

Read More »

రిజర్వేషన్లకు పార్లమెంటు లో చట్టం చేయాలి…

-సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్ జై బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు పార్లమెంటు లో చట్టం చేయాలని సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్ జై బాబు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు నిలుపుదల చేశాయని, మరి …

Read More »

శ్రీభగవద్రామానుజ శ్రీవైష్ణవ సంఘ సమాఖ్య మొదటి కార్యవర్గ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీతానగరం విజయకీలాద్రి జీయర్ స్వామివారి ఆశ్రమంలో ఉభయ రాష్ట్రాల శ్రీవైష్ణవ సంఘాలతో ఏర్పడిన శ్రీభగవద్రామానుజ శ్రీవైష్ణవసంఘ సమాఖ్య మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీమాన్ మరింగంటి తిరుమొళిశై ఆళ్వార్ స్వామి‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో శ్రీవైష్ణవ సంప్రదాయ దేవాలయాలు, పీఠాలు, సంఘాల మధ్య సమన్వయం సాధించాలని తద్వారా సంప్రదాయ రక్షణకు కృషి జరగాలని వక్తలు ముక్తకంఠంతో ఏకాభిప్రాయాన్ని తెలిపారు. సమాఖ్య జిల్లాలు, ప్రాంతాలు, గ్రామాలలోకి వ్యాపించి అన్ని విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించాలని …

Read More »

అవనిగడ్డ గ్రామ ప్రధాన డ్రైనేజీ సమస్య పరిష్కారంపై దృష్టి

-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -సీతాయమ్మ హోటల్ వద్ద డ్రైనేజీ పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : అవనిగడ్డ గ్రామ ప్రధాన డ్రైనేజీ సమస్య పరిష్కారంపై దృష్టి సారించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక సీతాయమ్మ హోటల్ వద్ద డ్రైనేజీని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్.డబ్ల్యూ.ఎస్ డీఈఈ పాలచర్ల సత్యనారాయణతో కలిసి అవనిగడ్డ గ్రామ డ్రైనేజీ స్వరూప మ్యాప్ పరిశీలించారు. కరకట్ట నుంచి మండపం మీదుగా మురుగు కాలువ వరకూ ఉన్న ప్రధాన డ్రైనేజీని సీతాయమ్మ హోటల్ …

Read More »

ఆంద్రప్రదేశ్ మానవ వనరులు, సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రదేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార కమీనర్ శామ్యుల్ జొనాధన్ యుఎస్ కాన్సులెట్ జనరల్ హైదరాబాదు లోని ఆర్థిక, రాజకీయ విభాగ అధ్యక్షుడు ఫ్రాంక్ పి టల్లుటో మరియు రాజకీయ ఆర్థిక నిపుణుడైన సిబా ప్రసాద త్రిపాఠి, మరియు కర్రి శ్రీమాలి ని విజయవాడ లో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వారు భారతదేశ అమెరికా మద్య గల స్నేహపూర్వమైన బంధాన్ని గర్తుచేసుకుంటూ ఈ రెండు అతిపెద్ద దేశాలలో ప్రజాస్వామ్య మనుగడ గత కొన్ని ఏళ్ళనుండి కొనసాగుతుందని, ఇటీవల …

Read More »

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే సుజనా ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం అందజేశారు. కుమ్మరిపాలెం కు చెందిన లింగంశెట్టి సత్యనారాయణ క్యాన్సర్ తో బాధపడుతూ ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. బాధితుని భార్య పుట్లమ్మ సహాయం చేయాలని ఎమ్మెల్యేని కోరగా,తక్షణమే కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి. రూ, 5000/- వేల నగదును అందజేశారు. అలాగే ఆర్టీసీ వర్క్ షాప్ ప్రాంతంలోని మాధవి అనే గృహిణి ఆరోగ్యం బాగోలేదని మందుల నిమిత్తం సహాయం కోరగా …

Read More »

అమర రాజా గ్రూపులో ఉద్యోగాల కొరకు పోస్టర్స్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అమర రాజా గ్రూపులో ఉద్యోగాల కొరకు పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ కష్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం ద్వారా పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లో ఉత్తీర్ణత అయిన యువతి యువకులకు అమరరాజా గ్రూప్ తిరుపతి నందు మిషన్ ఆపరేటర్స్ మరియు అప్రెంటిస్ ఉద్యోగాల కొరకు 07- 08-2024 తేదీన అనగా బుధవారం నాడు ఉదయం 9 …

Read More »

రెవెన్యూ, ఎన్హెచ్ఎఐ అధికారులు సమన్వయంతో పురోగతి సాధించాలి…

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో టైం లైన్ ప్రకారం పురోగతి ఉండేలా సమన్వయంతో పనితీరు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి తిరుపతి జిల్లాలోని జాతీయ రహదారుల పెండింగ్ పనుల …

Read More »

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు

-రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీసు, రవాణా, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ తదితర అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో …

Read More »

ఆగస్ట్ మొదటి వారంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్ష నేపథ్యంలో అధికారులు నివేదికలు సిద్ధం చేయండి…

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి గారి కలెక్టర్ల సమీక్ష ఆగస్ట్ మొదటి వారంలో ఉన్న నేపథ్యంలో మునిసిపల్ కార్పొరేషన్, పరిశ్రమలు, పర్యాటక తదితర ముఖ్య శాఖల అధికారులు ప్రెజెంటేషన్ సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు ఆగస్ట్ నెలమొదటి వారం గౌ. ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై మునిసిపల్ కార్పొరేషన్, …

Read More »