Breaking News

రిజర్వేషన్లకు పార్లమెంటు లో చట్టం చేయాలి…

-సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్ జై బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు పార్లమెంటు లో చట్టం చేయాలని సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్ జై బాబు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు నిలుపుదల చేశాయని, మరి కొన్ని రాష్ట్రాల్లో అమలు సరిగా జరగడం లేదని వాపోయారు. దీనిపై సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తే రాష్ట్రాలు చట్టం చేసే పరిది కాదని, పార్లమెంటే రాజ్యాంగ సవరణ చేయాలని తీర్పులు చెబుతున్నా యని తెలిపారు. ప్రభుత్వ రంగం సంస్థలు అంతరిం చి పోతున్న తరుణంలో భావి తరాల కోసం ప్రైవేటు సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాల్సి న అవసరం ఉందన్నారు. ఈ సమస్యకు పార్లమెంట్ మాత్రమే పరిష్కారం చూపించాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు చట్టబద్ధత కోసం సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్తం గా ఉద్యమం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ నగర మాజీ మేయర్ తాడి శకుంతల మాట్లాడుతూ మహిళల కు 50% రిజర్వేషన్ అమలు చేశారు. కానీ కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు. మహిళలం దరూ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో సోషలిస్ట్ జనత కాంగ్రెస్ కూటమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓర్పు వీరభాస్కర్, ఎం.సి.పి.ఐ(యు) రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి, అమరావతి భూముల పరిరక్షణ ఛైర్మన్లు అనుమోలు గాంధీ, శిరిపురపు ప్రాన్సీస్, బొల్లిపోగు బజారు, యు.వై.ఎఫ్.ఐ రాష్ట్ర కన్వీనర్ కాసాని గణేష్ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *