Breaking News

Monthly Archives: August 2024

త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు

జనరల్‌ డెస్క్‌, నేటి పత్రిక ప్రజావార్త : దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు. శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్‌ మాతాకీ అంటూ …

Read More »

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న చంద్రగిరి ఎంఎల్ఏ

-పులివర్తి నాని చేతుల మీదుగా జాతీయ పతాకం ఆవిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి తాసిల్దార్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని ఆయన చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి తాసిల్దార్, సబ్ రిజిస్టార్, పోలీసులు, విద్యుత్, వైద్య ఇతర …

Read More »

ఈ నెల 17న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రేణిగుంట విమానాశ్రయం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం ఉండరాదు

–జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 17వ తేదీన స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవానికి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సతీ సమేతంగా హాజరు కానున్నారని, ఆ సందర్భంగా వారు రేణిగుంట విమానాశ్రయానికి 17వ తేదీ ఉదయం 9.40 గం. లకు చేరుకోని నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లి తిరిగి సాయంత్రం 3.35 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, భద్రత తదితర …

Read More »

కనుల పండుగగా దేశ భక్తి ఉట్టిపడేలా 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

-ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగరేసిన గౌ. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి -డి ఆర్ డి ఎ ద్వారా 4869 మంది స్వయం సహాయక సంఘాలలోని 35,244 మంది సభ్యులకు, బ్యాంక్ లింకేజి, స్త్రీ నిధి ఉన్నతి, సి.ఐ.ఎఫ్ పథకాల లబ్ధి దారులకు రూ.250 కోట్ల రుణాల మెగా చెక్కును పంపిణీ చేసిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి -మెప్మాా లోని 6920 స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 96 కోట్ల …

Read More »

స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి…

-సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం -జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు అశేష జనం పాల్గొని బ్రిటీష్‌ వారిని తరిమికొట్టారని చెప్పారు. అల్లూరి …

Read More »

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎందరో ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నస్వేచ్చ, స్వాతంత్ర్యమని, దేశం కోసం వారు చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎంఎల్సీ కెఎస్.లక్ష్మణరావు, నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, జిన్నా టవర్ సెంటర్, …

Read More »

హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్నిపెంపొందుతుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్నిపెంపొందుంతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్థానిక గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు 200 మీటర్ల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నగర పౌరులు తమ ఇళ్ల మీద జాతీయ జెండాని ఎగురవేశారని, …

Read More »

త్యాగధనుల ఫలమే భారతావనికి స్వేచ్ఛా వాయువులు

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నందు గురువారం జరిగిన వేడుకలలో వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచి, స్వేచ్ఛా వాయువులు …

Read More »

త్యాగధనులు, మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం

-దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం -వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు -రాజమహేంద్రవరం  పర్యాటకంగా  మరింత అభివృద్ధి చేస్తాం -ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడిన ప్రభుత్వం -78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకావిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డి నరసింహా కిషోర్, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట కోమల విలాస్ సెంటర్ వద్ద గల వైయస్సార్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా మహేష్ జెండాను ఎగరవేసిన అనంతరం పుస్తకాలు బిస్కెట్లను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు శ్రీనివాసరావు, నూనె సోమశేఖర్, తవ్వా మారుతి, కొరగంజి వెంకటరమణ, షేక్ అమీర్ భాష, పాస్టర్ ప్రభుదాస్, సిగ్నంశెట్టి రాము గుప్తా ,షేక్ షాహినా, సాబిన్కర్ నరేష్, నేమాల …

Read More »