హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్నిపెంపొందుతుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్నిపెంపొందుంతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్థానిక గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు 200 మీటర్ల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నగర పౌరులు తమ ఇళ్ల మీద జాతీయ జెండాని ఎగురవేశారని, అధికారులు కూడా సేల్ఫీలు తీసి తిరంగా యాప్ లో అప్ లోడ్ చేసారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్ధులు, యువతతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టామన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంపొందించడానికి హర్ ఘర్ తిరంగా, ఆజాది కా అమృతోత్సవం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, డి.వెంకట లక్ష్మీ, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్.ఈ. శ్యాం సుందర్, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *