Breaking News

Daily Archives: September 2, 2024

మంత్రి కొలుసు పార్థసారధి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమన్వయంతో భారీ వర్షాలకు నష్టాలను నివారించగలిగారు

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమన్వయంతో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలతో జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా నివారించగలిగాం. వర్షాలు ప్రారంభమై, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భారీ వర్షాల కారణంగా నష్టం వాటిల్లకుండా తీసుకోవలసిన చర్యలపై ముందుగానే దిశా నిర్దేశం చేశారు. …

Read More »

విజ‌య‌వాడ వ‌ర‌ద‌ బాధిత కుటుంబాల‌కు 75,000 అత్య‌వ‌స‌ర మందుల కిట్లు

-ఒక్కో కిట్లో 6 ర‌కాల మందులు -మందులు వాడే విధానాన్ని వివ‌రిస్తూ క‌ర‌ప‌త్రాలు -వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తుపాను, భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపున‌కు గురైన విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో దాదాపు 75,000 అత్య‌వ‌స‌ర మందుల కిట్ల పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింద‌ని ఆ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుండి ఫుడ్ …

Read More »

నేనున్నాను అంటూ భ‌రోసా ఇచ్చిన ఎంపి కేశినేని శివనాథ్

-స్వ‌యంగా స‌హాయ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ న‌గ‌ర్ లో బుడ‌మేరు వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం మ‌ద్యాహ్నం స‌మ‌యంలో మ‌రోసారి ప‌రిశీలించారు. కండ్రిక ప్రాంతంలో ముంపుకి గురైన ప్రాంతాల‌ను ప‌రిశీలించటంతో పాటు, వ‌ర‌దలో చిక్కుకొన్న బాధితుల్ని పున‌రావాస కేంద్రాలు త‌ర‌లించే స‌హాయ చ‌ర్య‌లు వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే ప్ర‌జ‌లు కూడా అల‌క్ష్యం వ‌హించ‌కుండా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లివెళ్లాల‌ని …

Read More »

కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన ఎం.పి.కేశినేని శివనాథ్

-పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడ మేరు వాగుకి గండి పడటం, కృష్ణ నదికి వరద ఉదృతి పెరగడటం తో రామలింగేశ్వర నగర్ కరకట్ట ప్రాంతాన్ని, వరద ముంపుకు గురైన ఇళ్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ తో కలిసి ఎం.పి. కేశినేని శివ నాథ్ సోమవారం పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే మంత్రి నారాయణ తో కలిసి పర్యటించారు. రామలింగేశ్వర నగర్ లో రోడ్లపైకి చేరుతున్న కృష్ణా నది వరద …

Read More »

అక్షయపాత్ర సరికొత్త రికార్డు

-అక్షయ పాత్ర ద్వారా రోజుకు 1.70 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించిన దివీస్ ఎమ్.డీ మురళీ కృష్ణ -సుమారు 2.5 కోట్ల వ్యయంతో 5 రోజుల పాటు ఈ సహాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో మంగళగిరిలో అక్షయ పాత్ర రికార్డు సరికొత్త సృష్టించింది. ఒకేరోజు 3లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3లక్షల …

Read More »

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

-పశ్చిమ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రంగంలోకి 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమలో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తమిళనాడు లోని ఆర్కోణం నుంచి వరద బాధితుల సహాయార్థం ప్రత్యేక బస్సుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. టీం కమాండర్ సంకేత్ గైక్వాడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపడుతున్నామన్నారు. సోమవారం …

Read More »

భోజన సౌకర్యాలు కల్పిస్తూ… మెరుగైన సేవలు అందిస్తూ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరదలు, వర్షాలు, కారణంగా పశ్చిమ లోని అనేక డివిజన్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానిక ప్రజలకు ఆహారపరంగా అసౌకర్యం ఏర్పడకూడదని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ నియోజకవర్గ వ్యాప్తంగా భోజన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆహార పదార్థాలు తయారుచేసి ఎంతమంది వచ్చినా వడ్డించేలా భోజన సదుపాయం కల్పించారు.ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ …

Read More »

అధైర్య పడొద్దు…అండగా ఉంటాం…

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ లో నీట మునిగిన ప్రాంతాలలో సోమవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్ రావు నగర్, పాల ఫ్యాక్టరీ, ప్రాంతాల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సుజనా సమస్యలు తెలుసుకున్నారు. వరదలను దీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. దురదృష్టవశాత్తు కొన్నిచోట్ల ప్రాణనష్టం సంభవించిందని మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి …

Read More »

ప్రకాశం బ్యారేజ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ప్రాంతాన్ని సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ కి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద ఉధృతి కొనసాగుతుందన్నారు. ప్రవాహానికి కొట్టుకు వచ్చిన బొట్ల వలన గేటు కొట్టకు పోయిందని దీనివల్ల ప్రకాశం బ్యారేజ్ కి ఏమి ఇబ్బంది లేదు అన్నారు. వరద తగ్గిన వెంటనే వేగంగా మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు లో …

Read More »

వరద బాధితులకు దివీస్ సంస్థ ఆపన్నహస్తం…

-2 కోట్ల 50 లక్షల ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చిన దివీ లాబ్స్ యాజమాన్యం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూఫాన్ కారణంగా గత రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలోకి భారీ ఎత్తున వరద నీరు చేరటంతో వేలాది గృహాలు నీటమునిగిపోయాయి. ఈ పరిస్థితులలో ప్రజలు, పిల్లలు, వృద్దులు భోజన సౌకర్యం లేక అల్లాడిపోతున్నారానే వార్తలు వెలువడుతున్న తరుణంలో దివీస్ యాజమాన్యం తక్షణమే స్పందించి ఆకలితో అలమటించే ప్రజల …

Read More »