Breaking News

అధైర్య పడొద్దు…అండగా ఉంటాం…

-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ లో నీట మునిగిన ప్రాంతాలలో సోమవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్ రావు నగర్, పాల ఫ్యాక్టరీ, ప్రాంతాల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సుజనా సమస్యలు తెలుసుకున్నారు. వరదలను దీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. దురదృష్టవశాత్తు కొన్నిచోట్ల ప్రాణనష్టం సంభవించిందని మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలన్నారు. మరో 24 గంటల్లో నీటి ప్రవాహం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు ఆహారాన్ని అందించేందుకు కార్యాలయ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎవరు అధైర్య పడొద్దుఅని అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *