Breaking News

కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన ఎం.పి.కేశినేని శివనాథ్

-పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుడ మేరు వాగుకి గండి పడటం, కృష్ణ నదికి వరద ఉదృతి పెరగడటం తో రామలింగేశ్వర నగర్ కరకట్ట ప్రాంతాన్ని, వరద ముంపుకు గురైన ఇళ్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ తో కలిసి ఎం.పి. కేశినేని శివ నాథ్ సోమవారం పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే మంత్రి నారాయణ తో కలిసి పర్యటించారు. రామలింగేశ్వర నగర్ లో రోడ్లపైకి చేరుతున్న కృష్ణా నది వరద ప్రాంతాలను పరిశీలించారు.ఇళ్ల మధ్యకు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని వి.ఎం.సి అధికారులకు ఎం.పి. కేశినేని శివ నాథ్ ఆదేశాలు ఇచ్చారు.అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తక్షణం తరలించే చర్యలు మొదలు పెట్టాలని చెప్పారు ప్రజలు భయాందోళనకు గురికాకుండా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు.వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పటం తో పాటు, అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి నారాయణ తో కలిసి ఎం.పి.కేశినేని శివ నాథ్ తెలిపారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *