-స్వయంగా సహాయ పనుల పర్యవేక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్ లో బుడమేరు వరద ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంపి కేశినేని శివనాథ్ సోమవారం మద్యాహ్నం సమయంలో మరోసారి పరిశీలించారు. కండ్రిక ప్రాంతంలో ముంపుకి గురైన ప్రాంతాలను పరిశీలించటంతో పాటు, వరదలో చిక్కుకొన్న బాధితుల్ని పునరావాస కేంద్రాలు తరలించే సహాయ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలు కూడా అలక్ష్యం వహించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. ప్రజలను వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మరిన్నీ బోట్స్ పంపించాలని సంబంధిత అధికారులతో పోన్ చేసి మాట్లాడారు. అవి వచ్చే వరకు ట్రాక్టర్స్ పై జనాలను తరలించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ ఏర్పాటు చేశారు. ఎంపి కేశినేని శివనాథ్ తో పాటు వున్న జిల్లా అధికారులు, పార్టీ నాయకులకి సహాయ చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. వరద కారణంగా భయపడిన ప్రజలకు ధైర్యం చేబుతూ, ప్రభుత్వం అండగా వుంటుందని భరోసా కల్పిస్తూనే అధికారులకి తగు విధంగా సూచనలు చేశారు.
Prajavartha Online Telugu News