Breaking News

Daily Archives: September 2, 2024

డ్రైన్లపై ఆక్రమణల తొలగింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో మొదలైన డ్రైన్లపై ఆక్రమణల తొలగింపు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై ఆక్రమణలను స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసి తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం జిటి రోడ్, శ్రీనివాసరావు తోట ప్రాంతాల్లో డ్రైన్లపై ఆక్రమణలను ఏసిపి అజయ్ కుమార్, టిపిఎస్ సువర్ణ కుమార్ లు అక్రమ ఆక్రమణ దళంతో …

Read More »

అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న ఆర్జీలను క్షేత్ర స్థాయి అధికారులు నేరుగా పరిశీలించి, అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పిజిఆర్ఎస్ కు సకాలంలో హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ తరుపున బిస్కెట్స్, పాలు, బ్రెడ్, పులిహోర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరంలోని ముంపు ప్రభావిత ప్రజలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున బిస్కెట్స్, పాలు, బ్రెడ్, పులిహోర అందిస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాల వలన విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  నారాయణ, సంచాలకులు హరి నారాయణ మురగన్  …

Read More »

విజయవాడ – బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా బోయింగ్ కొత్త సర్వీస్

-రాష్ట్రంలో విమాన కనెక్టివిటీ పై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ -బెంళూరు రాష్ట్ర రాజధానితో బాగా అనుసంధానించబడి ఉంది – నాయుడు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిని బెంగళూరుతో అనుసంధానం చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడి విజయవాడ – బెంగళూరు విమాన సర్వీసుల ప్రాధాన్యతను వివరించి సర్వీసులు నడిపేలా ఒప్పించారు. ఇందుకు సంబంధించి …

Read More »

కృష్ణాజిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాల బాలికల హాస్టల్‌, బెంగళూరులోని ఓ కేఫ్‌ వాష్‌రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టినట్లు వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

-మహిళల భద్రత & గౌరవంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ; ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు నోటీసులు జారీ -రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి 300కి పైగా ఫోటోలు, వీడియోలు తీశారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణ చేపట్టింది. హాస్టల్‌లోని విద్యార్థినులు కెమెరాను కనిపెట్టి ఆందోళనకు దిగడంతో …

Read More »

రక్తదానం వలన  ప్రాణాపాయ స్థితిలో ఉన్న  వారికి పునర్జన్మనిస్తుంది

-మంత్రి కందరు దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రక్తదానం చేయటం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ఇచ్చినవారవుతామని, రక్తదానం దాతృత్వంతో కూడిన మంచి సేవా కార్యక్రమమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, వైద్యులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, మరొకరి జీవితంలో వెలుగునిస్తుందన్నారు. రక్తదానం …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో వచ్చిన అర్జీలు.. 144

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో శాఖపరమైన అధికారులు పరిష్కరించాలని కే ఆర్ ఆర్ సి ఎస్ డీ సి ఆర్ కృష్ణ నాయక్ , జిల్లా సహకార సంఘాల అధికారిఆర్ . శ్రీరాములు నాయుడు లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి తరుపున జిల్లా …

Read More »

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల కు జిల్లా తరపున అపన్న హస్తం

-పునరావాస సహాయ కార్యక్రమంలో స్వచ్ఛంద పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు -జిల్లా నుంచి 16 వాహనాలు ద్వారా నిత్యవసర వస్తువుల వితరణ -కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ, వివిధ అసోసియేషన్స్, స్వచ్చంధ సంస్థలు ద్వారా స్వచ్ఛందంగా సేకరించిన ఆహార పదార్ధాలు, వాటర్ బాటిల్స్, పాలు, బ్రెడ్, క్యాండెల్స్, అగ్గిపెట్టెలు తదితర నిత్యావసర వస్తువులను పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి …

Read More »

“మట్టి విగ్రహాలనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం”

-కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను వినాయక చవితి పండుగ సంధర్భంగా పూజించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరు విడిది కార్యాలయంలో శ్రీ విఙ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ” మట్టి విగ్రహాలనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం ” గొడప్రతిని జాయింట్ కలెక్టర్ తదితరులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ ఒక ప్రత్యేకత కలిగి …

Read More »

వైఎస్సార్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే – భూమన

-సామాన్యుడినైన నాకు ఎంపీ పదవి జగన్ పుణ్యమే – ఎంపీ గురుమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు వైసిపి ముఖ్య నాయకులు ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ తో తన ఆత్మీయ సంబంధాలని తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నెమరువేసుకొన్నారు. వైఎస్సార్ ఆత్మగా పేరుగాంచిన కెవిపి తరువాత ఆ మహనీయుడుతో తనకు సాన్నిహిత్యం ఉందన్నారు. ఇవాళ తాను ఈ స్థితిలో ఉన్నానంటే అది వైఎస్సార్ పుణ్యమే అన్నారు. వైఎస్సార్ కి ముందు …

Read More »