Breaking News

డ్రైన్లపై ఆక్రమణల తొలగింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో మొదలైన డ్రైన్లపై ఆక్రమణల తొలగింపు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై ఆక్రమణలను స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసి తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం జిటి రోడ్, శ్రీనివాసరావు తోట ప్రాంతాల్లో డ్రైన్లపై ఆక్రమణలను ఏసిపి అజయ్ కుమార్, టిపిఎస్ సువర్ణ కుమార్ లు అక్రమ ఆక్రమణ దళంతో తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో డ్రైన్ల పై ఆక్రమణల వలన వ్యర్ధాలు అడ్డుపడి వర్షం నీరు రోడ్ల మీదకు, ఇళ్లల్లోకి వెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో నిలిచిన నీటిని బెయిల్ అవుట్ చేయడానికి కూడా డ్రైన్ లో పారుదల లేక సాధ్యం కావడంలేదన్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా డ్రైన్ల ఆక్రమణలను వార్డ్ సచివాలయాల వారీగా పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో గుర్తించి, వాటి తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. అలాగే డ్రైన్ల ఆక్రమణలను ముందస్తుగానే గుర్తించి తొలగించాలని సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. ప్రస్తుత వర్షాల వలన నగరంలో ఏ ప్రాంతంలో నీరు నిలిచి ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారో ఆయా ప్రాంతాల్లో భవిష్యత్ లో సమస్యలు రాకుండా తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. నగర ప్రజలు కూడా ప్రధాన డ్రైన్ల వివిధ వ్యాపారాల పేరుతొ ఆక్రమణ చేసుకోవద్దని, తప్పనిసరిగా డ్రైన్ కి వెనుక వైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రైన్ల మీద, డ్రైన్ కి ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించడం జరుగుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *