Breaking News

“మట్టి విగ్రహాలనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం”

-కలెక్టరు పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను వినాయక చవితి పండుగ సంధర్భంగా పూజించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరు విడిది కార్యాలయంలో శ్రీ విఙ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ” మట్టి విగ్రహాలనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం ” గొడప్రతిని జాయింట్ కలెక్టర్ తదితరులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ ఒక ప్రత్యేకత కలిగి ఉన్న పండుగ అని పేర్కొన్నారు. ప్రకృతిలో మమేకమయ్యే , పర్యావరణ సమతుల్యత కాపాడే సహజ సిద్ధమైన పూలు మొక్కలు, ఆకులతో పూజించే ఆచారం కలిగి ఉన్న పండుగ అన్నారు.. మట్టి గణపతి విగ్రహాలను తీసుకుని వొచ్చి ప్రతీ ఒక్కరూ పూజలు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ లో మనం కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, తదితర మెటీరియల్ తో తయారుచేసే విగ్రహాల వలన పర్యావరణం కాలుష్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గా మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే పూజలు చెయ్యాలనీ తెలిపారు. స్వచ్చంధ సంస్థలు ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పూజించే సంస్కృతి సాంప్రదాయాలు ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఎంతయినా ఉందని పేర్కొన్నారు.

శ్రీ విఙ్ఞాన వేదిక స్వచ్చంధ సంస్థ ఆద్వర్యంలో ఉభయా గోదావరీ జిల్లాల పరిధిలో మట్టి గణపతి విగ్రహాలను పూజించర్ క్రమంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలియ చేశారు. ప్రతీ ఒక్కరూ తప్పకుండా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని, మన వంతుగా పర్యావరణ పరిరక్షణ కోసం మరి కొందరికి స్పూర్తి నీ కల్పించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఎల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు , శ్రీ విఙ్ఞాన వేదిక స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు కంతేటి వెంకటరాజు, సీహెచ్ రంగశాయి లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *