Breaking News

Daily Archives: September 5, 2024

డ్రోన్ లతో బ్లీచింగ్ లిక్విడ్స్ స్ప్రే చెయ్యండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బ్లీచింగ్ చేయడం ద్వారా ప్రజలను అనారోగ్య సమస్యల నుండి కాపాడవచ్చని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.యం గురువారం ఉదయం డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ లిక్విడ్ ను స్ప్రే చెయ్యమని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలలో బ్లీచింగ్ స్ప్రే చేయటం ద్వారా ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని, అతి తక్కువ సమయంలో వీలైనంత …

Read More »

మంత్రి కొలుసు పార్ధసారధి పరామర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక ప్రాంతంలోని బ్రమరాంబ పురానికి చెందిన పి.చంద్రశేఖర్ బుడమేరు వాగులో కొట్టుకు పోయి చనిపోయిన పి.చంద్రశేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గురువారం పరామర్శించారు. ఎంబిఎ చదువుకున్న చంద్రశేఖర్ తన డైరీ ఫారంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను వరదల నుంచి కాపాడి ప్రమాదవాసాత్తు తను వాగులో కొట్టుకు పోయి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పార్ధసారధి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని …

Read More »

39 వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : డా.ఎస్.వెంకటేశ్వర్

-నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి అని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక రుయా ఆసుపత్రి నుండి ఎస్వీ మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39 …

Read More »

సియం సహాయ నిధికి ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం 5 లక్షల రూ.ల చెక్కు సియంకు అందించారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం (IASOWA) ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షురాలు సిఎస్ సతీమణి రేష్మ ప్రసాద్ తోపాటు పద్మ వల్లి, ప్రదా భాస్కర్ తదితరులు సియం ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు …

Read More »

10 రోజుల్లోనే వాహ‌నాల‌కు బీమా మొత్తం అందేలా చ‌ర్య‌లు

– ఇన్సూరెన్సు లేని వాహ‌నాల‌కు ఏ విధంగా సాయం చేయాలో చూస్తున్నాం. – దెబ్బ‌తిన్న వ్యాపారులను ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచిస్తున్నాం. – ఫైర్ ఇంజిన్ల‌తో పెద్దఎత్తున ఇళ్ల‌ను శుభ్రంచేసే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. – బుడ‌మేరుకు ప‌డిన రెండు గండ్లు పూడ్చాం. మ‌రోదాన్ని రేప‌టిక‌ల్లా పూడుస్తాం. – బియ్యంతో పాటు మ‌రో అయిదు వ‌స్తువుల కిట్‌ను ప్ర‌తి ఇంటికీ అందిస్తాం – రాయితీపై కూర‌గాయ‌ల‌ను అందిస్తాం – మీడియా స‌మావేశంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

వరద బాధితులకు ఉద్యోగుల భారీ సాయం – రూ.120 కోట్ల విరాళం

-వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. -వారి ఒకరోజు వేతనం రూ.120 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. -ఈ క్రమంలో సీఎం చంద్రబాబును కలిసి అంగీకారపత్రం అందించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకు వస్తున్నారు. ముందుకొచ్చిన ఈ దాతలు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి తోచినంత విరాళాలు ఇందిస్తున్నారు. అయితే తాజాగా వరద బాధితుల కోసం ఉద్యోగుల నుంచి భారీ విరాళం అందింది. ఏకంగా రూ.120 …

Read More »

వరద బాధితుల సహాయానికి సీఎంఆర్ఎఫ్ కు వెల్లువెత్తుతున్న విరాళాలు

-విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎంను కలిసి విరాళాలు అందిస్తున్న దాతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పలువురు దాతలు తమ ఔధార్యాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందిస్తున్నారు. విరాళాలు అందించిన వారిలో…. 1. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 లక్షలు 2. కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ రూ.25 లక్షలు 3. LVR & సన్స్ క్లబ్ …

Read More »