Breaking News

డ్రోన్ లతో బ్లీచింగ్ లిక్విడ్స్ స్ప్రే చెయ్యండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బ్లీచింగ్ చేయడం ద్వారా ప్రజలను అనారోగ్య సమస్యల నుండి కాపాడవచ్చని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.యం గురువారం ఉదయం డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ లిక్విడ్ ను స్ప్రే చెయ్యమని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలలో బ్లీచింగ్ స్ప్రే చేయటం ద్వారా ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని, అతి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ప్రాంతాలలో బ్లీచింగ్ స్ప్రే చేయాలంటే డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ లిక్విడ్ని స్ప్రే చేయడం ద్వారా ఎక్కువ ప్రాంతాలను తక్కువ సమయంలో బ్లీచింగ్ లిక్విడ్ ద్వారా బ్లీచింగ్ చేస్తూ ప్రజలను అనారోగ్యం పారిన పడకుండా కాపాడవచ్చు అని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు గురువారం ఉదయం అజిత్ సింగ్ నగర్ లోని డాబాకుట్లో సెంటర్ నుండి మొదలుపెట్టి రామకృష్ణాపురం, దావుబుచ్చయ్య కాలనీ, ఎంజి రోడ్ లోగల ఇంద్ర గాంధీ స్టేడియం నుండి వాహనాల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రజలకు ఆహారం, త్రాగునీరు పంపిస్తున్న పనులను పరిశీలించి. వరద ప్రభావితమైన ప్రాంతాలలో కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు అనుగుణంగా సెక్రెటరీలను వాలంటీర్ల సమన్వయంతో ఏ ప్రాంతంలోనైనా ఎవరికైనా ఖచ్చితంగా ఆహారం చేరేటట్టు చూసుకోవాలని ఎవరికీ ఆహారం లేకుండా ఉండకూడదని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *