Breaking News

మంత్రి కొలుసు పార్ధసారధి పరామర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక ప్రాంతంలోని బ్రమరాంబ పురానికి చెందిన పి.చంద్రశేఖర్ బుడమేరు వాగులో కొట్టుకు పోయి చనిపోయిన పి.చంద్రశేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గురువారం పరామర్శించారు. ఎంబిఎ చదువుకున్న చంద్రశేఖర్ తన డైరీ ఫారంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను వరదల నుంచి కాపాడి ప్రమాదవాసాత్తు తను వాగులో కొట్టుకు పోయి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పార్ధసారధి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందుతుందని, భాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ డైరీ ఫారంలోని 40 ఆవులు గేదెలు ఈ వరదలో కొట్టుకు పోయాయి.కృష్ణ లంకలోని రామాదేవి నగర్ కట్ట వద్ద వరద బాధితులకు ఆహారం,మంచి నీరు,పాలు పంపిణీ చేశారు. మంత్రి పార్థసారథి వెంట చింతలపూడి మాజీ శాసన సభ్యులు గంటా మురళి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *