Breaking News

సియం సహాయ నిధికి ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం 5 లక్షల రూ.ల చెక్కు సియంకు అందించారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం (IASOWA) ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షురాలు సిఎస్ సతీమణి రేష్మ ప్రసాద్ తోపాటు పద్మ వల్లి, ప్రదా భాస్కర్ తదితరులు సియం ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను సియం సహాయ నిధికి అందించడం పట్ల రాష్ట్ర ప్రజలందరి తరపున ఆసంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *