-ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు, లాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని, ఏదైనా తక్కువ ఉన్నవాటిని నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోకి తెస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని, వైద్యాధికారులు మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి …
Read More »Daily Archives: September 11, 2024
బిఎల్ఓ లు ఎస్ఎస్ఆర్ -2025 ఇంటింటి ఓటర్ వెరిఫికేషన్ సర్వే పక్కాగా నిర్వహించి లోపాలు లేని ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలి
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : బిఎల్ఓ లు ఎస్ఎస్ఆర్ -2025 తయారీ నేపథ్యంలో ఇంటింటికి తిరిగి సర్వేను పక్కాగా నిర్వహించి లోపాలు లేని, పారదర్శకమైన ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం రేణిగుంట మండలం స్థానిక పాంచాలి వీధి నందు బిఎల్ఓ లు నిర్వహిస్తున్న ఎస్ఎస్ఆర్ -2025 ఇంటింటి సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పక్కాగా ఇంటింటి ఓటర్ …
Read More »టీచర్ గా మారి విద్యార్థినులకు పలు అంశాలపై బోధన చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్
-ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) కార్యక్రమం రేణిగుంట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం(PM SHRI) కింద ఎంపిక కాబడిన రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి సదరు పథకం అమలు తీరు బాగుందని, స్ఫూర్తిదాయకంగా ఉందని, మరింతగా మెరుగుదలతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయాలని, …
Read More »ANM / GNM / B.Sc Nursing చదివిన వారికి జపనీస్ (N5, N4, & N3) భాషపై శిక్షణ మరియు ఉపాధి
-అర్హులైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వార 25,000 రూపాయలు దరఖాస్తు రుసుము కొరకు స్కాలర్షిప్ పొందే అవకాశం -శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులకు జపాన్ దేశంలో నెలకి 1,00,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల జీతంతో ఉద్యోగం పొందే అవకాశం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు NAVIS HR ఆధ్వర్యంలో ANM / GNM / B.Sc Nursing చదివిన వారికి జపానీస్ భాష N5, N4, మరియు N3 స్థాయిలలో నేర్పించి, …
Read More »జిల్లాలో రూ.1200 కోట్ల నష్టం వాటిల్లింది..
-అంతర మంత్రిత్వ కేంద్ర అధికారులకు వరద నష్టాన్ని వివరించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదలకు వ్యవసాయ అనుబంధ రంగాలు, రహదారులు, ఇరిగేషన్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా తదితర రంగాలలో రూ.1200 కోట్ల నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర అధికారుల బృందానికి తెలిపారు. గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఏస్డిఎమ్ఏ) కార్యాలయ భవనంలో బుధవారం మధ్యాహ్నం జిల్లాకు సంబంధించిన వరద ప్రభావిత …
Read More »గుడివాడ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం
గుడివాడ (నందివాడ), నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ళ రాము కేంద్ర బృందానికి బుడమేరు వరద నష్టం వివరించారు. తొలుత పుట్టగుంట వద్ద నీట మునిగిన బుడమేరు బ్రిడ్జి, చేపల చెరువులు పరిశీలించారు. మండలంలో నీట మునిగిన పంట పొలాలు చేపల …
Read More »వరద బాధితులకు ఉచిత వైద్య చికిత్స శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిట్టి మహిళా సభ్యుల సహకారంతో వరద బాధితులకు ఉచిత వైద్య చికిత్స శిబిరం గమేలా కాలనీ, ఆటోనగర్ లో బుధవారం జరిగింది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఆటోనగర్ నందు గల రోడ్డు నందు వరద బాధితులకు ఉచిత వైద్య చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ ఇక్కడ ఎక్కువమంది వైరల్ జ్వరాలు, దగ్గు జలుబు, అలెర్జీస్ తో బాధపడుతున్నారని వీరందరికి బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించి …
Read More »డాక్టర్ అమ్మన్న ఆధ్వర్యంలో వరద బాధితులకు రిలీఫ్ కిట్లు పంపిణీ
– కుటుంబం మొత్తానికి అవసరమైన దుస్తులు, టవల్, దుప్పటి, 20 లీటర్ల వాటర్ క్యాన్ అందజేత – మొత్తం 1500 కిట్లను బాధితులకు అందజేశామని డాక్టర్ అమ్మన్న వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్, అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్. అమ్మన్న ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయక సామాగ్రిని అందజేశారు. అజిత్ సింగ్ నగర్ పైపులరోడ్డు సమీపంలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో డాక్టర్ అమ్మన్న బృందం బుధవారం పర్యటించింది. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి …
Read More »కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో పామర్రు నియోజకవర్గంలో తోట్ల వల్లూరు మండలంలో రొయ్యూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నియోజకవర్గంలో వరద నష్టం కేంద్ర బృందానికి వివరించారు. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కేంద్ర బృందాన్ని కలిసి వరద నష్టం వివరించి, సంబంధిత ఛాయాచిత్రాలు కేంద్ర బృందానికి చూపి రైతు లను ఆదుకోవాలని కోరారు. …
Read More »వరద నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చూడండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద నీరును నిలువ ఉండకుండా చూసుకోవాలని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం వరద ప్రభావిత ప్రాంతాలైన నందమూరి నగర్, వాంబే కాలనీ, కండ్రిక సెంటర్, సివిఆర్ ఫ్లైఓవర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా నందమూరి నగర్ లో పర్యటించి అక్కడ ఉన్న భూగర్భ డ్రైనేజీను, పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో …
Read More »