Breaking News

గుడివాడ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం

గుడివాడ (నందివాడ), నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ళ రాము కేంద్ర బృందానికి బుడమేరు వరద నష్టం వివరించారు. తొలుత పుట్టగుంట వద్ద నీట మునిగిన బుడమేరు బ్రిడ్జి, చేపల చెరువులు పరిశీలించారు. మండలంలో నీట మునిగిన పంట పొలాలు చేపల చెరువులు ద్రోన్ విజువల్స్ కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర బృందం వెంట గుడివాడ ఆర్డీవో పద్మావతి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కూడా ఉన్నారు.

కేంద్ర బృందంలో
1)అనిల్ సుబ్రమణియం, సంయుక్త కార్యదర్శి, (IS-I & CS), కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నాయకత్వంలో

2)రాకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్, కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ.

3)డాక్టర్. ఎస్ వి ఎస్ పి శర్మ, సైంటిస్ట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, హైదరాబాద్ సభ్యులుగా ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *