Breaking News

Daily Archives: September 14, 2024

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

డ్రైన్ల ఆక్రమణలు తొలగింపు పనులపై క్షేత్ర స్థాయి అధికారులకు తగు ఆదేశాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వర్షం నీరు డ్రైన్లలోకి మాత్రమే వెళ్ళాలని, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ప్రారంభించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం కమిషనర్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్, రైలు పేట, పొత్తూరి వారి తోట, గుంటూరువారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలు గమనించి, తొలగింపు పనులపై క్షేత్ర స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో డ్రైన్లపై ఆక్రమణల …

Read More »

మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను సమగ్రంగా తొలగిస్తాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో వరదలు చేసిన నష్ట అనుభవంతో గుంటూరు నగరంలో మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను సమగ్రంగా తొలగిస్తామని, నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శనివారం నగరపాలక సంస్థ ప్రదాన కార్యాలయంలో కమిషనర్ చాంబర్ లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జిఎంసి తరుపున చేపట్టిన సహాయక చర్యలు, డ్రైన్ల ఆక్రమణలు,పారిశుధ్యం, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, జిఎంసి ఆదాయ వనరుల పెంపుకు కార్యాచరణ, …

Read More »

మారిస్ స్టెల్లా కళాశాల లో హిందీ భాష దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాల లో హిందీ భాష దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు.ముఖ్య అతిథి గా స్నేహాల్ విమల్ శుక్లాల హిందీ విభాగాధిపతి ఆంధ్రా లయోలా కళాశాల విచ్చేశారు. హిందీ భాష గొప్పదనాన్ని ఆ భాష యండలి ప్రముఖ రచనలు భాష గొప్పదనాన్ని కృషి చేసి పండితుల గురించి వివరించారు ప్రపంచ వ్యాప్తం గా హిందీ మాట్లాడే వారు వున్నారని భారతీయ భాషలలో హిందీ భాష కూడా ప్రచినమైందని ఆమె తెలిపారు. కార్య క్రమం లో …

Read More »

గ్రామీణ ప్ర‌జ‌ల‌ ఆరోగ్య సేవ‌ల‌కు విఘాతం క‌లిగించొద్దు

-విధుల‌కు హాజ‌రై ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి -పిహెచ్ సీ డాక్ల‌ర్ల స‌మ‌స్య‌ల్ని ప్రభుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది -పీహెచ్‌సి డాక్ట‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల్ని మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తాం -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల అసోసియేషన్ ప్ర‌తినిధులు వివరించిన సమస్యల్ని ప్రభత్వం పరిగణనలోకి తీసుకుని త‌ప్ప‌కుండా పరిశీలిస్తుంద‌నీ, త్వ‌ర‌లో మరోసారి వారిని చర్చలకు పిలుస్తామ‌నీ, ఇటువంటి పరిస్తితులలో, వైద్యులు ధర్నాలు వంటి కార్యక్రమాలు తలపెట్టకుండా విధులకు హాజరై గ్రామీణ ప్రాంత ప్రజల …

Read More »

సమాజంలో వైద్యుల పాత్ర కీలకం

-వైద్య విద్యార్థులు వైద్య విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి -మంచి వైద్యులై పేదలకు మెరుగైన వైద్యం అందించండి -జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ -ఘనంగా ఎస్వి వైద్య కళాశాల కాలేజ్ డే తిరుపతి హెల్త్, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని,అటువంటి వైద్య విద్యను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు ప్రిన్సిపాల్ డాక్టర్ …

Read More »

సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో 42వ డివిజన్ పరిధిలో శుక్రవారం అనారోగ్యంతో మరణించిన యలకల శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద అయినటువంటి యలకుల శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని మాజీ కార్పొరేటర్ యేదు పాటి రామయ్య సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు …

Read More »

సీతారాం ఏచూరికి ఘన నివాళి అర్పించిన శాసనసభ్యులు సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కన్నుమూసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరీ పార్థివదేహానికి మాజీ కేంద్రమంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) శనివారం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. పార్థివ దేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సీతారాం ఏచూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలను అలవర్చుకున్న ఆయన తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లోనే …

Read More »

“స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత” ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవ 2024

-స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు -రాష్ట్ర స్ధాయిలో భాగస్వామ్య సంస్ధలతో హైబ్రీడ్ విధానంలో సన్నాహక సమావేశం -సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పక్షం రోజుల కార్యక్రమాలు -అక్టోబరు 2 గాంధీ జయంతి వేళ జాతిపితకు నివాళి అర్పిస్తూ ముగింపు వేడుకలు -పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, పురపాలక, పట్టణాభివృద్ది శాఖల సంయిక్త భాగస్వామ్యం -రాష్ట్ర స్ధాయి నోడల్ ఏజెన్సీగా స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి …

Read More »

వరదలతో నష్టపోయిన చిన్న తరహా పరిశ్రమలకు సాయం అందించాలి

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరదలతో నష్టపోయిన చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. నగరంలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరద ఉద్ధృతితో విజయవాడలోని అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రూ. లక్షలు విలువ చేసే యంత్రాలు పాడైపోవడమే కాకుండా అనేక మంది ఉపాధికి దూరమయ్యారని పేర్కొన్నారు. ప్రదానంగా ఫర్నీచర్, ఫ్లైవుడ్, ప్రింటింగ్ …

Read More »