విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైపరీత్యాల సమయంలో వైఎస్సార్ సీపీ పేదలు, బాధితులకు అండగా నిలుస్తుందని ఆ పార్టీ నేతలు అన్నారు. హనుమాన్ పేటలోని గోడౌన్ వద్ద మంగళవారం 50 వేల కుటుం బాలకు పంపిణీ చేసేందుకు సిద్దం చేసిన కిట్లను వాహ నాల్లో మూడు నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. వాహనాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు, పశ్చిమ ఇన్చార్జీలు దేవినేని …
Read More »Daily Archives: September 17, 2024
వదర బాధితులకు అత్యుత్తమ ప్యాకేజీని అందజేస్తున్నాం
-కృష్ణా, బురమేరు వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేల ఆర్థిక సాయం -నష్టపోయిన ప్రతి ఒక్కరినీ అన్నివిధాలుగా ఆదుకుంటాము -రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా కృష్ణా, బుడమేరు వరదలు సంభవించి విజయవాడ నగరాన్ని అతలాకుతం చేసినప్పటికీ, కేవలం పది రోజుల్లో అందరి సహకారంతో నగరంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ వరధ వల్ల …
Read More »ప్రమాదకర పరిశ్రమల్లో మూడు నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ తప్పక జరగాలి: సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో మూడు మాసాలకు ఒకసారి తప్పకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఐటిఇఅండ్సి, ఎన్ఆర్ఐ ఎంపర్మెంట్, టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు,వాణిజ్యం,కార్మిక, ఫ్యాక్టరీలు తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా పరిశ్రమల శాఖకు సంబంధించి మాట్లాడుతూ …
Read More »ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ప్రారంభం
-లబ్దిదారులకు ఇళ్ల తాళాలు అందజేసిన -జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ -స్థానిక ఎమ్మెల్యే సింధూర రెడ్డి పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని దేశ ప్రధాని గౌరవ నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. పట్టణ ప్రాంత పేదలకోసం పిఎంఏవై అర్బన్, గ్రామీణ ప్రాంతాలకోసం పిఎంఏవై గ్రామీణ్ పథకాలను ప్రవేశపెట్టారు. లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. ఒడిషా రాష్ట్రంలో అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. …
Read More »వరద ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం
-రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి -1000 మందికిబాధితులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం కిట్ల పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన వరద ముంపు బాధితులు అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం పంజా సెంటర్ ప్రాంతంలో నంద్యాల కు చెందిన గురు రాఘవేంద్ర విద్యాసంస్థల తరపున …
Read More »బాధితులు ఎవరైనా, కమిషన్ లో ఫిర్యాదు చేస్తే తగు చర్యలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికైన గిరిజన ప్రజా ప్రతినిధులపై ఇతరవర్గాల దాడులను, ST కమిషన్ తీవ్రంగా పరిగణించి, సంబంధిత వ్యక్తులపై చర్యలకు పోలీస్ అధికారులకు సిఫారసు చేయటం జరుగుతుందని ST కమిషన్ ఛైర్మన్ డా. డి .వి. జి. శంకర రావు తెలిపారు. ఇటీవల పత్రిక లలో ప్రచురితమైన పార్వతీపురం మన్యం జిల్లా , సాలూరు మండలం , మరిపల్లి పంచాయితీ లోని మహిళా MPTC సభ్యురాలు జన్ని సీతారామ్ పై, జరిగిన దాడిని కమిషన్ సుమోటో …
Read More »పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ పై రేపు చర్చలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ విషయానికి సంబంధించి రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తో బుధవారం నాడు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల్ని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ సంఘం ప్రతినిధులకు మంగళవారం సాయంత్రం సమాచారాన్ని అందించారు. ఈ సమావేశానికి ముందు ఈ విద్యా సంవత్సరంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన పీజీ నీట్ పరీక్షలో అర్హత …
Read More »అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు..
-గతంలో మద్యం దుకాణాల్లో సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారు.. -మద్యపాన నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పారు.. -ప్రభుత్వ ఆదాయం గత పాలకుల జేబుల్లోకి వెళ్ళింది.. -ఎక్సైజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు.. -మల్టీ నేషనల్ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి.. -నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు.. -క్షేత్రస్థాయిలో సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నాం.. -6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం.. -గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు.. -ప్రజారోగ్యం దృష్ట్యా కొత్త ఎక్సైజ్ విధానం.. -నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అమరావతి, …
Read More »బీసీలకు పెద్దపీట
-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత -సీఎం చంద్రబాబు నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖపై సమగ్ర సమీక్ష -గడిచిన 5 ఏళ్లలో బీసీలు పూర్తిగా చితికిపోయారన్న మంత్రి -ఎన్డీయే కూటమితో బీసీలకు పూర్వవైభవం రాక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. మంగళవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గడిచిన అయిదేళ్లలో బీసీలు పూర్తిగా చితికిపోయారన్నారు. …
Read More »శానిటేషన్ వర్కర్స్ అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో శానిటేషన్ వర్కర్స్ అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, వైద్య, మెప్మా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఈరోజు నుండి జిల్లాలో ప్రారంభమైన స్వచ్ఛతాహిసేవ క్రింద చేపట్టవలసిన కార్యక్రమాలు గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో సఫాయి మిత్ర సురక్ష శివిర్ అంశం క్రింద గ్రామాల్లో శానిటేషన్ సిబ్బంది అందరికీ …
Read More »