Breaking News

Daily Archives: September 17, 2024

ANM / GNM / B.Sc Nursing చదివిన వారికి జపనీస్ (N5, N4, & N3) భాషపై శిక్షణ మరియు ఉపాధి

-అర్హులైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వార 25,000 రూపాయలు దరఖాస్తు రుసుము కొరకు స్కాలర్షిప్ పొందే అవకాశం -శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులకు జపాన్ దేశంలో నెలకి 1,00,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల జీతంతో ఉద్యోగం పొందే అవకాశం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు NAVIS HR ఆధ్వర్యంలో ANM / GNM / B.Sc Nursing చదివిన వారికి జపానీస్ భాష N5, N4, మరియు N3 స్థాయిలలో నేర్పించి, …

Read More »

వైద్యం కొరకు ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించుటతో పాటు వారికి అందించే ప్రతి వైద్య సేవలో బాధ్యతగా వ్యవహరించాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యం కొరకు ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించుటతో పాటు వారికి అందించే ప్రతి వైద్య సేవలోనూ బాధ్యతగా అన్ని స్థాయిలలో ఆసుపత్రి నందు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తిరుపతి ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (రూయా ఆస్పత్రి) నందు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి, స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కో చైర్మన్ హోదాలో, …

Read More »

విశ్వకర్మ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని వారి చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా జాయింట్ మాట్లాడుతూ.. సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని తెలిపారు. కమ్మరి, వడ్ల, స్వర్ణకార, శిల్ప …

Read More »

తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.

-నగరాన్ని శుభ్రంగా ఉంచుదాం-ఎమ్మెల్సీ సిపాయి -పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు – కమిషనర్ మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కమిషనర్ ఎన్.మౌర్య సంయుక్తంగా అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మహతి ఆడిటోరియం నుంచి తారకరామ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డాక్టర్ …

Read More »

నులిపురుగుల నిర్మూలన ద్వారా పిల్లలు ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు

-ఆల్బెండజోల్ తగు మోతాదులో మాత్రలు వాడటం ద్వారా నులిపురుగులను నిరూలించవచ్చును -జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరం అని, విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమమును జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం …

Read More »

కమ్యూట్ ఆన్ సైకిల్ డే ప్రత్యేక కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చత హి సేవా లో భాగంగా గురువారం నిర్వహించే కమ్యూట్ ఆన్ సైకిల్ డే ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలు తమ దినచర్యలో కేవలం సైకిల్ మాత్రమే వినియోగించి కార్యక్రమ విజయవంతంలో భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ స్వచ్చత హి సేవా లో అక్టోబర్ 2 వరకు ప్రతి రోజు స్వచ్చత, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఒక ప్రత్యేక కార్యాచరణ …

Read More »

అధికారులు, విద్యార్ధులతో స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ నివాసాలతోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం ఒక అలవాటుగా పాటించాలని అప్పుడే స్వచ్చ గుంటూరు, స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్  అన్నారు. స్వచ్చత హి సేవా లో భాగంగా మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, నగరాలులోని నవీన స్కూల్ వద్ద, లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎంఎల్ఏలు మహ్మద్ నసీర్, బి.రామాంజనేయులు, జి.మాధవి, డిప్యూటీ మేయర్ షేక్.సజిలా, కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్ధులతో స్వచ్ఛత హి …

Read More »

నగరంగా తీర్చిదిద్దుకవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళ వారం కమిషనర్ ఛాంబర్ లో మరియు కౌన్సిల్ సమావేశమందిరంలో ఐటిసి ఎంఎస్కె అండ్ ఫినిష్ సొసైటీ రూపొందించిన స్వచ్చత హి సేవా పోస్టర్స్ ని నగర కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చత హి సేవా లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు …

Read More »

స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చత హి సేవా లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రజారోగ్య కార్మికుల మస్టర్ పాయింట్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, వార్డ్ సచివాలయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో షుమారు 1.25 లక్షల మందితో స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ చేపట్టామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో …

Read More »

నోట్ బుక్స్ పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం ఫెర్రీలోని విజయ శక్తి విద్యాలయం వరదలతో పూర్తిగా మునిగిపోవడంతో విద్యార్థుల పుస్తకాలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఆ స్కూల్లో చదువుకున్న 2002 విద్యా సంవత్సరం బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఇబ్రహీంపట్నం ఎంఈఓ చెరుకూరి పుష్పలత సమక్షంలో 260 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందించారు. ప్రధానోపాధ్యాయులు తులసీ ద్వారా ఈ విషయం తెలియడంతో ఆనాటి మా తోటి విద్యార్థుల అందరి సహకారంతో 50 వేల రూపాయల విలువైన నోట్ పుస్తకాలను …

Read More »