Breaking News

Daily Archives: September 20, 2024

విజయవాడ లోని నోవాటెల్ హోటల్ లో అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్-వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్- 2024

-కాన్‌క్లేవ్ కు హాజరైన 200 మందికి పైగా పర్యాటక ప్రతినిధులు -రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హాజరైన హెచ్. ఈ. ఎంగ్యూయేన్ థాన్హయ్ -ఆంధ్రప్రదేశ్, వియత్నాం మధ్య పర్యాటక మరియు కల్చరల్ ఎక్స్చేంజ్‌కు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు -రెండు దేశాల మధ్య పర్యాటక అవకాశాలపై దృష్టి సారించిన ప్రతినిధులు -రాష్ట్రంలో రెండు ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక, …

Read More »

బ్యాంకింగ్ సేవ‌లకు ప్ర‌త్యేక ఫెసిలిటేష‌న్ కేంద్రం

– ఒకేచోట అందుబాటులో 13 బ్యాంకుల కౌంట‌ర్లు – అక్క‌డిక‌క్క‌డే రీషెడ్యూల్‌తో పాటు కొత్త రుణాల ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం. – ఫెసిలిటేష‌న్ కేంద్రం సేవ‌ల‌ను ముంపు బాధితులు స‌ద్వినియోగం చేసుకోవాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో నష్టపోయిన ప్ర‌జ‌ల‌కు బ్యాంకింగ్ సేవ‌లు అందించేందుకు ప్ర‌త్యేకంగా విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బ్యాకింగ్ ఫెసిలిటేష‌న్ కేంద్రం ఏర్పాటు చేయ‌డం జరిగింద‌ని.. బాధితులు ఈ కేంద్రం సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ …

Read More »

వేదవిద్య లో ఉత్తీర్ణత పొంది నిరుద్యోగులుగా ఉన్నవారికి నిరుద్యోగ భ్రుతి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వేదవిద్య లో ఉత్తీర్ణత పొంది నిరుద్యోగులుగా ఉన్నవారికి నిరుద్యోగ భ్రుతి క్రింద నెల ఒక్కింటికి రూ.3,000/- పొందేందుకు ఆసక్తి గల నిరుద్యోగ వేద పండితుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె.సుపద్నాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. వేద విద్య లో క్రమాంతం ఆపై కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణత పొందిన నిరుద్యోగులు, నిరుద్యోగ భ్రుతిని పొందేందుకు దరఖాస్తు తో పాటు వేద విద్య సర్టిఫికెట్లనఖలు, ఆధార్ నఖలు …

Read More »

వాహనాలను రిపేర్లు చేసి త్వరగా బాధితులకు అందజేసే విధంగా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపుకు గురైన మోటార్ వాహనాలను రిపేర్లు చేసి త్వరగా బాధితులకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలియజేసారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లోని రవాణా కార్యాలయం నుండి శుక్రవారం నాడు ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు ఈ సందర్భంగా రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ వరద ముంపుకు గురైన వాహనాలు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను త్వరగా ఇప్పించే ప్రక్రియను చేపట్టాలని అలాగే …

Read More »

ఆర్థిక సంక్షోభంలోనూ లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేసింది

-ప్రభుత్వ ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది -దేశంలోనే ఒక తిరుగులేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది -రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తుందని అందుకు ఈ వంద రోజుల్లో అమలు చేసిన కార్యక్రమాలే నిదర్శనమని సిటీ శాసనసభ్యులు …

Read More »

జైలు వాతావరణం జైలులా కాకుండగా ఆశ్రమ వాతావరణమును తలపిస్తుంది

-జైలు వాతావరణం జైలులా కాకుండగా ఆశ్రమ వాతావరణమును తలపిస్తుంది -మహిళా ఖైదీలతో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్న.. -రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ -గజ్జల వెంకటలక్ష్మి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రాజమండ్రిలో రెండు రోజులు పర్యటనలో భాగంగా నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ న్యూఢిల్లీ వారి ఆదేశానుసారం స్పెషల్ ప్రిజన్ ఫర్ వుమెన్ రాజమహేంద్రవరంను రెండు రోజులు సందర్శించినారు. ఇందులో భాగంగా రెండవ రోజు శుక్రవారం జైలు మొత్తం తిరిగి …

Read More »

పారా లీగల్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సల్సా వారి ఆదేశానుసారం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు పారా లీగల్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో పారా లీగల్ వాలంటీర్లుగా నియమితులైన వారికి న్యాయ సేవలు, వివిధ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం రెండు రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు …

Read More »

భారతీయ సంస్కృతిలో హస్త కళలు ఒక భాగం

-కులవృత్తుల నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫారం కి తీసుకురావడం జరిగింది -వార్ధా, మహారాష్ట్ర స్వాలంబి గ్రౌండ్ నందు నిర్వహించిన తొలి వార్షిక కార్యక్రమం లో పాల్గొన్న పిఎం -వర్చువల్ కార్యక్రమం ద్వారా జిల్లా నుంచి పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు -ఎంపీ డి.పురాందేశ్వరి -జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన భారతీయ సంస్కృతితో ముడిపడి వున్న హస్త కళలను కాపాడుకుంటూ ఆ వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సహాన్ని అందించే దిశగా పి …

Read More »

సంక్షేమల్లో సదుపాయాలు ప్రాధాన్యత

-సీఏస్ఆర్ కింద అభివృద్ధి పనులు -కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ వసతి గృహాలలో “సి ఎస్ ఆర్” కింద వసతుల కల్పన పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు అంచనాలు అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో సంక్షేమ, పరిశ్రమల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సి ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి, చేపట్టవలసిన …

Read More »

దేశ అభివృద్ధిలో యువత కీలకం.

-రాబోయే ఐదేళ్లలో మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం -యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే సత్ ఫలితాలు సాధ్యం -ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి -కలెక్టర్ పి.ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో మార్పు తీసుకురావాలని తపన, సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో కూడి సరైన విధానాలు ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎం. పి. దగ్గుబాటి పురందరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నన్నయ యూనివర్సిటీ ఆవరణలో జరిగిన …

Read More »