Breaking News

Daily Archives: October 11, 2024

జిల్లాలోని ప్రజలందరికీ విజయ దశమి పండుగ శుభాకాంక్షలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయ దశమి పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్. విజయ దశమి పండుగ అనేది భక్తి శ్రద్దలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ అని, నవరాత్రి పండుగ సందర్భంగా, భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని మరియు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి …

Read More »

దసరా పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సులలో అధిక చార్జీలు వసూలు చేయడాన్ని నివారించడానికి రవాణా శాఖ చేపట్టిన విస్తృత తనిఖీలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సులలో అధిక చార్జీలు వసూలు చేయడాన్ని నివారించడానికి, తిరుపతి జిల్లా రవాణా శాఖాధికారి మురళీ మోహన్ గారి ఆదేశాల ప్రకారం రవాణా శాఖాధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దసరా పండుగ సెలవుల సందర్భంగా వాహనాల అధిక రద్దీ మరియు రహదారి భద్రత దృష్ట్యా ఈ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సంయుక్త తనిఖీలు తొమ్మిదో తారీఖు నుండి 14 తారీకు వరకు రవాణా శాఖ అధికారులు చేపట్టనున్నారు. ముఖ్యంగా హైదరబాదు, బెంగళూరు …

Read More »

బాలికా సదనంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఏటా అక్టోబర్‌ 11వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారనీ, ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు నిర్వహించి బాలికలకు సామాజిక అంశములపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలలో చెతన్యం కల్పిస్తున్నాం అని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ నయోమి మరియు …

Read More »

శ్రీ మహిషాసుర మద్దినీ దేవి అలంకరణలో దుర్గమ్మ   

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని. క్రోది నామ సంవత్సర దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజున ఆశ్వయుజ శుద్ధనవమి తిథి ఉన్నప్పుడు మహర్నవమి రోజున కనకదుర్గ అమ్మ శ్రీ మహిషాసుర మద్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎనిమిది రోజుల యుద్ధం తరవాత అమ్మ నవమినాడు మహిషాసురుణ్ని మర్దించి, లోకాలన్నింటికి ఆనందాన్ని చేకూర్చింది. అమ్మ అవతారాన్నింటిలో దుష్టశిక్షణ చేసిన ఈ రూపం అత్యుగ్రం. అందరు …

Read More »