తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ ఏటా అక్టోబర్ 11వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారనీ, ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు నిర్వహించి బాలికలకు సామాజిక అంశములపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలలో చెతన్యం కల్పిస్తున్నాం అని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ నయోమి మరియు జిల్లా బాలల సంక్షేమ అధికారి శివ శంకర్, సోషల్ వర్కర్ దేవయాని, కౌన్సిలర్ కల్పన పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News