మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే విధానంలో లోటుపాట్లపై లోతుగా అధ్యయనం చేసి ఆటో వాలాలకు ఎంతవరకు ప్రయోజనకరము పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. డీజిల్ ఆటోలను ఈ వి వాహనాలుగా కన్వర్ట్ చేయడానికి అయ్యే వ్యయం వ్యయం, ప్రయోజనాలు తదితర అంశాలపై చెన్నై నుండి వచ్చిన కంపెనీ ప్రతినిధులు బుధవారం కలెక్టరేట్లో వారి ఆటోలను ప్రదర్శించి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రవాణా అధికారులకు …
Read More »Monthly Archives: October 2024
ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధానం కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా …
Read More »డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, మ్యూజియంను తొలగించాలనే ఆలోచన తగదు… : వడ్లమూరి కృష్ణ స్వరూప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వరాజ్ మైదానంలోని బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, మ్యూజియంను తొలగించాలని చూస్తే.. బాబు, పవన్ కళ్యాణ్ సర్కార్ పైన తిరుగబాటే.. దళిత బహుజన పార్టీ డి బి పి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు. నేడు డాక్టర్. అంబేద్కర్ మహా సామాజిక న్యాయ శిల్పి సముదాయమును సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా దేశానికీ తలమానికి లాంటి అద్భుతం మైన మహా విగ్రహంను గత ప్రభుత్వం నిర్మించడం జరిగిందని హర్షం వ్యక్తం చేసారు. ఐతే ప్రస్తుతం …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి ఇద్దరు మృతి చెందడం దిగ్భ్రాంతికరం
-హోంమంత్రి వంగలపూడి అనిత -బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటాం: హోంమంత్రి -విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామ శివారులోని బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు మృతి చెందడం విషాదకరమన్నారు. మృతి చెందిన కుటుంబాలకు హోం మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. …
Read More »జల్ జీవన్ మిషన్ పనులు పరుగులు తీయించాలి
-ఆర్.డబ్ల్యూ.ఎస్. విభాగం ఎస్.ఈ., ఈ.ఈ.లతో నవంబర్ 8న వర్క్ షాప్ -జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ, జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం …
Read More »గుడ్..బాగా చేశారు
-అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహించిన అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర పెట్టుబుడులు, మౌలికసదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి, ఎస్. సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఆయనకు డ్రోన్ జ్ఞాపికను బహుకరించారు. ఈ …
Read More »45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం
-ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదు -150 అడుగుల మేర నీటిని నిల్వచేసి నదులను అనుసంధానం చేస్తాం -రెండు ఫేజులు అంటూ ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదే -రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని, గతంలో తాము ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల …
Read More »రవాణా అధికార్లు యూనిఫామ్ లేకుండా రోడ్డు పై కనబడితే కఠిన చర్యలు తప్పవు మంత్రి వెల్లడి.
-కడప ఆర్టీవో కార్యాలయంలోని బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయ భాస్కర్ రాజు పై తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని మంత్రి హితవు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అధికారై ఉండి అక్రమ వసూళ్లు పాల్పడటం హ్యేయమని, అధికారిని ప్రశ్నించడం పట్ల డ్రైవర్ల ఆవేదన అర్ధమవుతుందని, కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్ రాజు అక్రమ డ్రైవర్లు వద్ద వసూళ్లకు …
Read More »అన్న క్యాంటీన్లు, వరద బాధితులకు విరాళాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకు సజ్జా రోహిత్ అనే దాత రూ. 1 కోటి విరాళం అందజేశారు. సచివాలయంలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి విరాళానికి సంబంధించి చెక్కును అందజేశారు. అలాగే కపిలేశ్వరపురం మాతృభూమి శ్రేయోసంఘం ప్రతినిధి కె. రామ్మోహనరావు కూడా అన్న క్యాంటీన్లకు రూ.5,41,116 చెక్కును అందజేశారు. ఎస్.కె. యూనివర్సిటీ సిబ్బంది తరఫున ఆచార్య జి.వెంకట నాయుడు రూ.17,34,786, కుప్పం నియోజకవర్గం నుండి సేకరించిన రూ.14,36,000 విరాళాన్ని మాజీ ఎమ్మెల్సీ …
Read More »వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి
-బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం -బుడమేరు వరద నివారణ కు డీపీఆర్ సిద్ధం చేయండి -అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సచివాలయంలో బుధవారం …
Read More »