Breaking News

Monthly Archives: October 2024

వినియోగదారుల నుండి స్పందన బాగుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బజార్లలో తక్కువ ధరకు అందిస్తున్న టమాటాలు, వంట నూనెలకు వినియోగదారుల నుండి స్పందన బాగుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి అన్నారు. డీఎస్ఓ గురువారం స్థానిక రైతు బజార్ సందర్శించి టమాట, ఆయిల్ విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ నేటి నుండి రైతు బజార్లలో కిలో టమాట 50 రూపాయలు, లీటర్ పామాయిల్ 114 రూపాయలు, లీటరు సన్ఫ్లవర్ ఆయిల్ …

Read More »

వైద్య సిబ్బంది ప‌నివేళ‌లు పాటించ‌క‌పోవ‌డంపై మంత్రి ఆగ్ర‌హం

-ప‌ర్య‌వేక్ష‌ణ లోపాన్ని స‌వరించాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం -ఉన్న‌త స్థాయ‌లో ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ను వైద్య ఆరోగ్య శాఖ‌లోని హెచ్వోడీల‌కు అప్ప‌గించిన మంత్రి -హాజ‌రు న‌మోదు చేసేందుకు రూపొందించిన యాప్ ల‌ను మ‌రింత ప‌టిష్టం చేయాలి -ప‌నివేళ‌లు పాటించ‌ని సిబ్బందికి ఆటోమేటిక్ గా స‌మాచారం, షోకాజ్ నోటీసు జారీ చేయ‌బ‌డాలి -ప‌నివేళ‌ల ప‌ట్ల క్ర‌మ‌శిక్ష‌ణ‌పై మూడు గంట‌ల పాటు ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మీక్ష‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జారోగ్యాన్ని కాపాడాల్సిన ప్ర‌భుత్వ వైద్యులు, ఇత‌ర సిబ్బంది నిర్ణీత ప‌నివేళ‌లు పాటించ‌క‌పోవ‌డంపై రాష్ట్ర …

Read More »

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ గా బత్తుల.తాతయ్య బాబు పదవి బాధ్యతలు స్వీకరణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద వాడికి పక్కా గృహం నిర్మించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల.తాతయ్య బాబు తెలియచేసేరు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ గా నియమితులైన తాతయ్యబాబు గురువారం విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన పదవీ భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు తో గృహాలు నిర్మించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం …

Read More »

మెప్మా డిజిటల్ మార్కెటింగ్

-ONDC(ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ద్వారా ఆన్లైన్ లో మెప్మా SHG ఉత్పత్తులు -మెప్మా బజారు, SARAS ఎక్సిబిషన్ ద్వారా సూక్ష్మ మరియు చిన్న తరహా ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం -స్వర్ణాంధ్ర @ 2047 లో భాగంగా మహిళల ఆర్ధికాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతుందన్న మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా పట్టణాలలోని స్వయం సహాయక సంఘాలు తయారు చేసే …

Read More »

మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-రూ. 60 లక్షలు సొంత నిధులు వెచ్చించి పాఠశాలకు ఎకరం ఆట స్థలం కొనుగోలు -స్థలాన్ని మైసూరవారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన …

Read More »

వన్ నేషన్…వన్ ఎలక్షన్ విధానాన్ని బలపరుస్తాం.

-పార్లమెంట్, శాసనసభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు -మోడీ నాయకత్వాన్ని దేశం హర్షిస్తోందనడానికి హర్యానా ఫలితాలే నిదర్శనం -ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు మద్ధతుగా నిలుస్తున్నారు -మోడీ హవా తగ్గిందనే తప్పుడు ప్రచారం జమ్మూ, హర్యానా ఎన్నికల ఫలితాలతో కొట్టుకుపోయింది -2047 నాటికి దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటుంది -రెండు రోజుల ఢిల్లీ పర్యటన సత్ఫలితాలను ఇచ్చింది -వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇవ్వాలని ప్రధాని, కేంద్ర మంత్రులను కోరా -రాష్ట్రంలో …

Read More »

బీసీల సంక్షేమానికి, విద్యార్థుల భవితకు కూటమి ప్రభుత్వం పెద్దపీట..

-మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు.. డీఎస్సీ కోచింగ్ సెంటర్లపై తాను తొలి సంతకాలు -చదువుతో పాటు ఆటపాటల్లో కూడా చిన్నారులు రాణించాలి -పిల్లలకు అండగా తాము ఉన్నామన్న భరోసా తల్లిదండ్రులు కల్పించాలి -రాష్ట్రంలో 107 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు.. స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రత్యేక శిక్షణ -జ్యోతిబా & సావిత్రిబాయి పూలే పేరుతో ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం సంతోషకరం -రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్. సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే ప్రభుత్వానికి బీసీలే …

Read More »

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ మధ్య సంబవించిన వరదల కారణంగా నష్టపోయిన దాదాపు 4.06 లక్షల మంది బాదితులకు నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లించినట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్ట్రాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సుమారుగా రూ.602 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉందని అంచనావేయగా, అందులో రూ.601 కోట్లను ఇప్పటికే చెల్లించడం జరిగిందని, మిగిలిన సొమ్మును కూడా ఆధార్ సీడింగ్ తదుపరి తక్షణమే చెల్లించడం …

Read More »

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నా

-గతం కంటే మిన్నగా భక్తులకు సౌకర్యాలు కల్పించాం -ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మకు చీరసారె సమర్పించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న దుర్గాదేవి భక్తులకు దసరా శుభాకాంక్షలు. అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టం. దుర్గమ్మపై భక్తిభావం, విశ్వాసంతో రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. …

Read More »

మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవదాన్ని అదృష్టంగా భావిస్తున్నాను…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం శ్రీ సరస్వతీ దేవి అలంకృత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని దుర్గమ్మ భక్తులందరికీ నమస్కారం. అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవదాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. దుర్గమ్మపైన ఉండే భక్తిభావంతో పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ఒక్కోసారి లక్షమందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. …

Read More »