ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. శరన్నవరాత్రుల ఉత్సవాలలో విశిష్టమైన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకరణ లో ఉన్న కనక దుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున సంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించేందుకుగాను వచ్చిన …
Read More »Monthly Archives: October 2024
జగన్మాత చెంత కళావైభవం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మూలా నక్షత్రం రోజైన బుధవారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిచ్చారు. ఇంతటి పుణ్యదినాన అమ్మవారికి భజన సంకీర్తనలు, సంగీతం, నృత్యం, హరికథలతో కళాకారులు పూజించారు. కనకదుర్గ నగర్ లోని కళావేదికపై నాగమణి బృందం, మీనాక్షి శ్రీనివాస్, సింధు బృందం, సాత్విక్ మహదేశ్వర్ ఆలపించిన భజన సంకీర్తనలు భక్తులను సమ్మోహన పరిచాయి. సిహెచ్ అజయ్ కుమార్,సింధూ నాగేశ్వరి బృందం ఆలపించిన సంగీత విభావరి అమ్మవారి భక్తులను పులకింపచేసింది. సిహెచ్ ఆనంద్, ఏం పావని, సంతోష్, …
Read More »యేర్పాట్లు భేష్…
-క్యూ లైన్ లలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అమ్మవారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం …
Read More »భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ నిరంతర పర్యవేక్షణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ నిరంతర పర్యవేక్షణ. మీడియా పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో అత్యంత విశేషమైన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున శ్రీ కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎంతో విశేషమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల భోగాలు కలుగుతాయని …
Read More »సరస్వతీ దేవి అవతారాన్ని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మూల నక్షత్రం పర్వదిన రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న జగన్మాతను తన కుమార్తె ఆద్య తో కలిసి బుధవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామరావులు ఆలయ అధికారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళ తాళాలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ లతో కలిసి దేవాదాయ …
Read More »అమ్మ అనుగ్రహంతో… అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం…
-నవరాత్రి ఉత్సవాలపై 92% భక్తుల సంతృప్తి -సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతి, పోలవరం నిర్మాణాలు అమ్మ అనుగ్రహంతో నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. మూల నక్షత్ర పర్వదినమైన బుధవారం సరస్వతీ దేవి అవతారంలో కొలువుతీరిన జగన్మాతను సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కె. ఎస్. రామారావు, దేవాలయ అధికారులు …
Read More »ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ తపాలా వారోత్సవాలు మరియు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డి.ఎస్.వి.ఆర్.మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లోని పోస్టాఫీసులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.వి.ఆర్.మూర్తి మాట్లాడుతూ “విజయవాడ హెడ్ పోస్టాఫీసు ను విజయవాడ జనరల్ పోస్టాఫీసుగా పేరు మార్చడం” గురించి తెలియజేశారు. ఇండియా పోస్ట్ తన సాంకేతిక అంశాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కస్టమర్ల …
Read More »ఒడిస్సా అర్బన్ అకాడమిలో వివిధ ప్రాజెక్ట్ లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న కార్యక్రమాల స్టడీ టూర్ లో భాగంగా బుధవారం బాసుఘై మున్సిపల్ కార్పోరేషన్ లోని ఒడిస్సా అర్బన్ అకాడమిలో వివిధ ప్రాజెక్ట్ లను పరిశీలించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మరియు బృందం. ఈ సందర్భంగా కమిషనర్ గారికి ఒడిస్సా అర్బన్ అకాడమీలోని వికేంద్రీకృత ఘన మరియు వ్యర్ధాల నిర్వహణ సెంటర్, మల వ్యర్ధాల శుద్ధి కేంద్రాల పని తీరుని స్థానిక అధికారులు …
Read More »చిరువ్యాపారులకు ఆర్ధిక చేయూత అందుతుంధి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి స్వానిధి ద్వారా చిరువ్యాపారులకు ఆర్ధిక చేయూత అందుతుందని, గుంటూరు నగరంలోని వీధి వ్యాపారులను స్వానిధి వెబ్ సైట్ లో నమోదు చేయించాలని ఏపి మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ ఐఏఎస్ ఆర్.పి.లు, సిఎంఎంలను ఆదేశించారు. బుధవారం స్వానిధి సే సమృద్ధి వారోత్సవాల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వీధి వ్యాపారులు, ఆర్.పి.లతో జరిగిన సమావేశంలో మెప్మా మిషన్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపి మెప్మా మిషన్ డైరెక్టర్ …
Read More »వైద్య రంగానికి సాయం అందించేందుకు నీతి అయోగ్ సానుకూల స్పందన
-కడప జిల్లాలోని కాశీనాయన క్షేత్రం అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి అంగీకారం -అవిభక్త అనంతపురం జిల్లాలో మైనారిటీల అభివృద్ధికి ప్రతిపాదనల్ని పంపించమన్న కేంద్రం -రాష్ట్రానికి రానున్న నీతి అయోగ్ సభ్యుడు, కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి -ఫలించిన మంత్రి సత్యకుమార్ చర్చలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెండు, మూడు దశల్లో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అవసరాల మేరకు అందించడానికి నీతి అయోగ్ సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో రాష్ట్ర వైద్య …
Read More »