గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమగ్రాభివృద్ధి, స్వచ్చ గుంటూరు సాధనకు స్టేక్ హోల్డర్స్ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి, స్వచ్చ గుంటూరు సాధనలో అధికారులు, ప్రజల భాగస్వామ్యం అంశాలపై నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎంఎల్సీలు కెఎస్.లక్ష్మణరావు, సిహెచ్.ఏసురత్నం, ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ లతో కలిసి నగర కమిషనర్ నేతృత్వంలో …
Read More »Daily Archives: November 1, 2024
జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగిన నవంబర్ నెలకు సంబందించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ
-జిల్లాలో 2,65,488 మంది లబ్దిదారులకు సుమారు రూ.112.37 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగిందని ఉదయం 6గం.ల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో 2,65,488 మందికి 5295 మంది సచివాలయ సిబ్బంది ద్వారా రూ.112.37 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా …
Read More »పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
-డిఆర్ఓ నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే శాఖ పై ఆన్ ది స్పాట్ స్టడి టూర్ నిమిత్తం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాకు విచ్చేయనున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. రైల్వే శాఖ పై స్టడి టూర్ నిమిత్తం ఈ నెల 3 వ తేది తిరుపతి జిల్లాకు చేరుకుంటున్న ఎం.పి రమేష్ సారథ్యంలో వస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి ఏర్పాట్లలో …
Read More »గెస్ట్ ఫాకల్టీ గా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క తాత్కాలిక మెరిట్ లిస్ట్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇందు మూలముగా తెలియజేయునది ఏమనగా, EMRS కొడవలూరు, ఓజిలి, బి.ఎన్ కండ్రిగ లో తెలుగు, హిందీ, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్ట్స్ నందు గెస్ట్ ఫాకల్టీ గా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క తాత్కాలిక మెరిట్ లిస్ట్ ITDA కార్యాలయం నెల్లూరు నందు నోటీసు బోర్డు లో మరియు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, తిరుపతి వారి కార్యాలయం లో ప్రదర్శించడం జరిగింది. కావున వీటిపై ఏమైనా అభ్యంతరములు ఉన్నచో తేదీ 4.11.2024 లోపుగా ITDA కార్యాలయము నందు …
Read More »దీపావళి కానుకగా జిల్లాలో దీపం -2 పథకంలో భాగంగా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహణ..
-దీపం -2 పథకం కింద గ్యాస్ బుక్ చేసుకొన్న లబ్ధి దారులకు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాలకు 48 గంటల్లోపు జమ: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ తడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలులో భాగంగా నేడు అర్హులైన తెల్ల రేషన్ కార్డు …
Read More »దీపం 2 పథకాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, జెసి రాముడు
-జిల్లాలో ప్రయోజనం పొందనున్న 5 లక్షల 29 వేల మంది -ఈ ఏడాది మూడు సిలిండర్ల కోసం ప్రభుత్వం చెల్లించనున్న రూ.76,94,69,376 -మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు పై హర్షం వ్యక్తం చెయ్యడమే నిదర్శనం -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఇచ్చిన రెండోవ హామీ అమలు చెయ్యడం జరిగిందని, జిల్లాలో దీపం 2 పథకం కింద 5,29,070 మందికి రూ . 76 కోట్ల 95 లక్షల మేర ఆర్ధిక ప్రయోజనాన్ని చేకూర్చనున్నట్లు …
Read More »ఆదర్శ సౌర గ్రామాలను గుర్తించండి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆదర్శ సౌర గ్రామాల ఏర్పాటుకు అర్హత ఉన్న గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆదర్శ సౌర గ్రామాల ఏర్పాటుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సౌరశక్తిని ప్రోత్సహించేందుకు జిల్లాకు ఒక సౌరశక్తితో పనిచేసే గ్రామాన్ని రూపొందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన ఆదర్శ సౌర గ్రామాల …
Read More »లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే దీపం-2 పథకానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీపం-2 పథకం క్రింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక 27వ డివిజను ఇనగుదురు పేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ …
Read More »పీఎం సూర్య ఘర్ పథక వినియోగాన్ని ప్రోత్సహించండి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందే విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో శుక్రవారం ఉదయం ఆయన సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల …
Read More »జిల్లాలో నైపుణ్య గణన చేపట్టుటకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నైపుణ్య గణన చేపట్టుటకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను విద్యాసంస్థల ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో నైపుణ్య గణన ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో 15 నుంచి 59 సంవత్సరాల వరకు వయసు కలిగి చదువుతున్న విద్యార్థుల నైపుణ్య గణనను చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్క …
Read More »