-20 కోట్లతో పలు రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు -నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తా -ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ప్రభుత్వము మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు/చట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం చాట్రాయి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార …
Read More »Daily Archives: November 3, 2024
వరద బాధితులకు పరుపులు, దుప్పటి, గోడ గడియారం కిట్ ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఈరోజు ఏలూరు ఫ్లాష్ టీం, విజయవాడ ఫ్లాష్ టీం మరియు రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో న్యాయవాది యర్రంశెట్టి శ్రీనివాసరావు సౌజన్యంతో బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.గురునాధం, ఎపి హై కోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ సురాబత్తుల మల్లేశ్వరరావు, బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా చేతుల మీదుగా బుడమేరు వరద ముంపు కారణంగా సర్వస్వం కోల్పోయిన ఎల్.బి.ఎస్.నగర్, ప్రకాష్ …
Read More »సీనియర్ సిటిజన్ లకు చేతి కర్రలను బహుకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ సిటిజన్ లకు చేతి కర్రలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం, సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలు బహుకరణ చేశారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు సీనియర్ సిటిజెన్ల భద్రతమైన నడక సౌకర్యార్థం చేతి కర్రలను క్లబ్ అధ్యక్షులు ఎస్.కె. బాబు, సెక్రటరీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రూప్ కుమార్ కమిటీ సభ్యులకు బహుకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం అందచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పడవల …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రి నాదెండ్ల మనోహర్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.
Read More »బీసీ విద్యార్థిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి ఆకస్మిక మృతిపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలను తక్షణమే అందజేయాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్ లో ఏడో తరగతి చదువుతున్న శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన కొణతాల శ్యామలరావు(12) ఎప్పటిలాగే ఆదివారం …
Read More »తిరుపతి జిల్లాకు చేరుకున్న రైల్వే శాఖపై స్టడీ టూర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
-రైల్వే శాఖపై సిఎం. రమేష్ సారథ్యంలోని స్టడీ టూర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రేణిగుంట రైల్వే స్టేషన్ నందు ఘన స్వాగతం రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే శాఖ పై ఆన్ ది స్పాట్ స్టడి టూర్ నిమిత్తం తిరుపతి జిల్లాకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి ఆదివారం సాయంత్రం దురంతో ఎక్స్ప్రెస్ రైలులో సిఎం రమేష్ సారథ్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్న వీరికి సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం అరుణ్ కుమార్ …
Read More »రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి వి.అనిత
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. ఆం.ప్ర రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వర్యులు వి.అనిత గారికి చిత్తూరు ఎంపీ దగ్గమళ్ళ ప్రసాద రావు, ఎస్పి ఎల్. సుబ్బ రాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్, ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం గౌ. ముఖ్యమంత్రి …
Read More »ఈ నెల 4వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …
Read More »సంక్రాంతి నాటికి రోడ్ల గుంతలన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి నాటికి రోడ్ల గుంతలన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 3 కోట్ల రూపాయలతో రేపు జిల్లా ఇన్చార్జి మంత్రి, పార్లమెంటు సభ్యులు, కూటమి నాయకులతో కలసి గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆదివారం మంత్రి కూటమి నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో జవాబుదారీ, పారదర్శక అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో …
Read More »గత ప్రభుత్వ హయంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికీ న్యాయం చేయాలి…
-ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కానికి ప్రభుత్వం చొరవ చూపాలి.. -కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించి, 12వ పి.ఆర్. సి కమిషనర్ ని నియమించాలి. -ఏపిజేఏసి అమరావతి రాష్ట్రనాయకులు బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, అలాగే గత ప్రభుత్వం నియమించిన 12వ పిఆర్సి కమిషనర్ రాజీనామా …
Read More »