తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.
Tags tirumala
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …