-ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి జి సౌజన్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణలో యువత కీలక పాత్ర వహించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి సౌజన్య అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా 3 రోజు 16.11.2024 ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్,మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ, సంయుక్త ఫౌండేషన్ మరియు ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థల కలయికలో విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో బాలల …
Read More »Daily Archives: November 16, 2024
ఇప్పటికైనా వైసీపీ కళ్లు తెరవాలి… : కొలనుకొండ శివాజీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి కాజేసిన కేసులో హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు గౌతంరెడ్డిని ఆ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలి. ప్రజల ఆస్తులను కబ్జాచేయడం, హత్యారోపణలతో పాటు 42 కేసులున్న వ్యక్తిని వైసీపీ అగ్రనాయకుడు అంబటి రాంబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు వెనకేసుకురావడం అత్యంత దురదృష్టకరమని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆ పార్టీ ఆయన్ను వెంటనే బహిష్కరించాలి. ఇక …
Read More »డేగ్లూర్, నాందేడ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపించండి… : పవన్ కళ్యాణ్
డేగ్లూర్, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్ర చరిత్రలో ఎంతోమంది మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారు. ఆ మహనీయుల స్ఫూర్తికి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఆటంకాలు కలిగిస్తున్నాయి. ప్రజలను విభజించి పాలించే అలాంటి పాలకులను తరిమికొట్టాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వానికి యువత, మహిళలు, మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలకాలి. మరాఠా గడ్డపై ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తిని నిలబెట్టాల’ని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. …
Read More »నారా కుటుంబంలో తీవ్ర విషాదం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు (తమ్ముడు), రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, శనివారం ఉదయం రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి …
Read More »నిస్వార్ధంగా పనిచేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సర్కిల్ వన్ లోని సి డి ఒ లు, సోషల్ వర్కర్లు, సి ఒ లు , ఆర్ పి లు, డ్వాక్రా సంఘాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శనివారం భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించి నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా ప్రతి విభాగం నిస్వార్ధంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతం చేయడానికి డ్వాక్రా సంఘాలకు, కమ్యూనిటీ …
Read More »నారా రామ్మూర్తి నాయుడు సేవలు చిరస్మరణీయం
-రామ్మూర్తి మృతికి ఎంపి కేశినేని శివనాథ్ సంతాపం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యే గా రామ్మూర్తి నాయుడు ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివి. పార్టీకి అందించిన సేవలు వెలకట్టలేనివి, చిరస్మరణీయం. ఆయన మరణం నారా కుటుంబానికి తీరని లోటు అని విజయవాడ ఎంపి కేశినేని …
Read More »జర్నలిజం జర్నలిస్టులు (జర్నలిజం బేసిక్స్) పుస్తకావిష్కరణ
-పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రచయిత సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం రచించిన జర్నలిజం-జర్నలిస్టులు (జర్నలిజం బేసిక్స్) ప్రత్యేక పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ నందు శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. జాతీయ పత్రిక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర జర్నలిస్టులకు మంత్రి పార్థసారథి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ …
Read More »గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లలో జరిగిన అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించిన మంత్రి నారాయణ
-లబ్దిదారుల కేటాయింపు,డీడీల చెల్లింపుల్లో అవకతవలపై ఎమ్మెల్యేల ఫిర్యాదు -అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై జరిగిన చర్చలో ప్రకటన చేసిన మంత్రి -మాజీ సీఎం పిచ్చి పనులలో లబ్దిదారులకు తీవ్ర ఇబ్బందులన్న నారాయణ -టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పనకు రుణ సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి చేసిన పిచ్చి పనులతో టిడ్కో ఇళ్ల లబ్దిదారులు,కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన లబ్దిదారుల ఎంపిక,బ్యాంకులకు …
Read More »రిజర్వాయర్ల అభివృద్ధి పనులకు రూ.156.60 కోట్లు మంజూరు చేయాలి
-నియోజకవర్గంలో చెరువుల మరమ్మత్తులు, తాగునీటి అవసరాలు తీర్చాలి -జలవనరుల శాఖ మంత్రిని కోరిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లాలో రైతులు, ప్రజలకు లబ్ధి చేకూరేవిధంగా పీలేరు మండిపల్లె నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లె రిజర్వాయర్‌లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులను పూర్తి చేసేందుకు రూ.156.60 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల …
Read More »పత్రికా స్వేచ్ఛను కాపాడటం అందరి బాధ్యత
-సామాజిక చైతన్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపిస్తూ నిష్పక్షపాతంగా పని చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ (నేషనల్ ప్రెస్ డే) శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ -పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని జాతీయ …
Read More »