Breaking News

నిస్వార్ధంగా పనిచేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సర్కిల్ వన్ లోని సి డి ఒ లు, సోషల్ వర్కర్లు, సి ఒ లు , ఆర్ పి లు, డ్వాక్రా సంఘాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శనివారం భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించి నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా ప్రతి విభాగం నిస్వార్ధంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతం చేయడానికి డ్వాక్రా సంఘాలకు, కమ్యూనిటీ సంస్థలు వారి సమాఖ్యలకు శిక్షణను ఇస్తామన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు శిక్షణ తోడ్పాటు నిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *