Breaking News

Daily Archives: November 19, 2024

డిసెంబర్ నెలలో 27, 28, 29 తేదీలలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సాంస్కృతిక పరిశోధన శిక్షణ కేంద్రం (ఎన్సిఆర్టిసి) సీఈవో డా.తాడేపల్లి శర్మ, కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వేదాంతం వెంకట నాగచలపతిరావు మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలెక్టరేట్లోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ స్వర్ణోత్సవాలలో పాల్గొనాలని వారు జిల్లా కలెక్టర్ ని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చే డిసెంబర్ నెలలో 27,28, 29 తేదీలలో కూచిపూడి …

Read More »

పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి…

మచిలీపట్నం (చిన్నాపురం), నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్యం ద్వారా గౌరవం మరియు ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం కలుగుతుందని, పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం బందరు మండలం చిన్నాపురంలో ఎంపీపీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మరుగుదొడ్లకు రంగులు వేయడం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ కలెక్టర్ ప్రారంభించారు. “మరుగు దోడ్లు వాడదాం-పరిసరాలు పరిరక్షిద్దాం”, మరుగుదొడ్లు వాడదాం- ఆరోగ్యాన్ని రక్షించుకుందాం” అంటూ …

Read More »

ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియాన్ని దశలవారీగా అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి…

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియాన్ని దశలవారీగా అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారంగుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం గుంటూరు నగరానికి ఐకాన్ గా అభివ్రుద్ధి చేయాల్సిన అవసరం ఉందని, వివిధ క్రీడాంశాల్లో ఎందరో జాతీయ, …

Read More »

వైసీపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేసింది

-ఆక్వా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది -ఆక్వా రంగానికి రాయితీలు ప్రకటించిన ఘనత చంద్రబాబు నాయుడుదే -వైసీపీ ప్రభుత్వం అర్థంలేని మూడు జీవోలు ఇచ్చి ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది -టీడీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు సమానంగా రాయితీలను అందించింది -వైసీపీ చేసిన ఘనకార్యాలతోనే డిస్కంలపై రూ.1990 కోట్ల భారం -ఆక్వా, నాన్ ఆక్వా జోన్ లంటూ రైతుల‌ను మోసం -యూనిట్ కి రూ.1.50 రాయితీ పొడ‌గింపు… మార్కెట్ సెస్ తొల‌గింపు -శాస‌న‌స‌భ‌లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమరావతి, …

Read More »

సమ్మె కాలానికి జీతాల విడుదల పట్ల ఏపీ పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల హర్షం

-సిఎం చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన సంఘం ప్రతినిధులు అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : గతంలో తాము చేసిన పది రోజుల సమ్మె కాలాన్ని డ్యూటీ పీరియడ్ గా పరిగణిస్తూ జీతాల్ని విడుదల చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం మంగళవారం నాడు ఒక ప్రకటనలో హర్షాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి,  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు …

Read More »

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పతాకం పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి

-ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ -సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలను రూపొందించండి : జిల్లా కలెక్టర్ డా..ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కాలుష్య రహిత పర్యావరణహిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వినియోగంలోనికి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ …

Read More »

భూ సేకరణ పనులను వేగవంతం చేయండి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నేషనల్ హైవే పి డి లు, రైల్వే శాఖ ఈ, ఈ, ఏ ఈ లు, తాసిల్దార్ ల తో భూ సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పలు భూ …

Read More »

పారిశ్రామిక మరియు పర్యావరణ శాఖ అభివృద్ధి కోసం భూముల సేకరణ పక్రియను వేగవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక మరియు పర్యావరణ శాఖ అభివృద్ధి కోసం భూముల సేకరణ పక్రియను త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు పారిశ్రామిక మరియు పర్యావరణ శాఖ అభివృద్ధికి భూముల సేకరణ ప్రక్రియపై మున్సిపల్ కమిషనర్ మౌర్య, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు, రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ.. జిల్లాలోని పారిశ్రామిక మరియు పర్యావరణ శాఖ అభివృద్ధికి …

Read More »

తిరుపతి నగరంలోని వివిధ ట్యాంకుల సుందరీకరణ పనులు, ప్రాధాన్యతగా తీసికొని వేగంగా పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని పలు ట్యాంకులు(కుంటలు) సుందరీకరణ పనులను ప్రాధాన్యతగా తీసికొని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు తిరుపతి నగరం లోని వివిధ ట్యాంకర్ల సుందరీకరణ పనుల పురోగతి పై చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ఆర్ డి ఓ తిరుపతి రామ్మోహన్, డ్వామా పిడి …

Read More »

సుజన చౌదరి ని కలిసిన సామినేని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడి గా ఇటీవల నియమితులైన సీనియర్ నాయకులు జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)ని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడిగడపలోని సుజనా చౌదరి ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో ఇటీవల జనసేన లో చేరిన నేతలతో ఉదయభాను సుజన చౌదరి ను కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి కి అండగా నిలబడిన జనసేన నేతలకి సుజనా చౌదరి శుభాకాంక్షలు తెలిపి …

Read More »