మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సాంస్కృతిక పరిశోధన శిక్షణ కేంద్రం (ఎన్సిఆర్టిసి) సీఈవో డా.తాడేపల్లి శర్మ, కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వేదాంతం వెంకట నాగచలపతిరావు మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలెక్టరేట్లోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ స్వర్ణోత్సవాలలో పాల్గొనాలని వారు జిల్లా కలెక్టర్ ని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చే డిసెంబర్ నెలలో 27,28, 29 తేదీలలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కు తెలిపారు. ఈ ఉత్సవాలను కృష్ణ జిల్లాలోని మొవ్వ మండలం కూచిపూడి నాట్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు వారు కలెక్టర్ కు వివరించారు. ఇది ఒక అంతర్జాతీయ నాట్య సమ్మేళనంగా పండుగ వాతావరణం లో నిర్వహించనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన కళాకారులకు పింఛను మంజూరు చేసే పథకం గురించి ఎన్సీఈఆర్టీ సీఈవో జిల్లా కలెక్టర్కు వివరించగా దాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని వాటి పూర్తి వివరాలు అందజేయాలని కలెక్టర్ వారిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News