Breaking News

పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి…

మచిలీపట్నం (చిన్నాపురం), నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుధ్యం ద్వారా గౌరవం మరియు ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం కలుగుతుందని, పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం బందరు మండలం చిన్నాపురంలో ఎంపీపీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మరుగుదొడ్లకు రంగులు వేయడం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ కలెక్టర్ ప్రారంభించారు. “మరుగు దోడ్లు వాడదాం-పరిసరాలు పరిరక్షిద్దాం”, మరుగుదొడ్లు వాడదాం- ఆరోగ్యాన్ని రక్షించుకుందాం” అంటూ విద్యార్థులు నినాదాలతో గ్రామంలో ర్యాలీగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తగినంత పారిశుధ్యం లేకపోవడం వల్ల బిలియన్ల మంది ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తేవడానికి ప్రపంచ టాయిలెట్ దినోత్సవం దోహదం చేస్తుందని, సురక్షితమైన మరియు అందుబాటులో ఉండే టాయిలెట్ సౌకర్యాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి 2013 నుండి ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ప్రతి ఏటా జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం థీమ్ “టాయిలెట్స్ ఏ ప్లేస్ ఫర్ పీస్” అన్నారు. ఈ సంవత్సరం భారత దేశం “హమారా సౌచాలై -హమారా సమ్మాన్” ప్రచారాన్ని ప్రారంభిస్తున్నదన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఈరోజు నుండి మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 వరకు వరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు పత్రాలు అందించడం, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రభుత్వ సంస్థల్లో టాయిలెట్స్ వాటికి వాటర్ సప్లై ఉండేలా చర్యలు తీసుకోవడం, టాయిలెట్స్ ఉత్తమ నిర్వహణకు బెస్ట్ టాయిలెట్స్ గుర్తించి అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

స్వచ్ఛభారత్ మిషన్ మరియు స్వచ్ఛ ఆంధ్ర పారిశుధ్యం మెరుగుపరచడానికి బహిరంగ మలవిసర్జన నిర్మూలించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ గోపాలరావు లతో పాటు అధికారులు జిల్లా పరిషత్ సీఈవో కన్నమ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా కోఆర్డినేటర్ పురుషోత్తం, డి ఈ నటరాజ్, ఉప విద్యాశాఖ అధికారి శేఖర్ సింగ్, ఎంఈఓ దుర్గాప్రసాద్, తాసిల్దారు మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *