-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామిక మరియు పర్యావరణ శాఖ అభివృద్ధి కోసం భూముల సేకరణ పక్రియను త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు పారిశ్రామిక మరియు పర్యావరణ శాఖ అభివృద్ధికి భూముల సేకరణ ప్రక్రియపై మున్సిపల్ కమిషనర్ మౌర్య, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు, రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ.. జిల్లాలోని పారిశ్రామిక మరియు పర్యావరణ శాఖ అభివృద్ధికి తిరుపతి నగర పరిధి, రేణిగుంట ఎయిర్పోర్ట్ నందు ప్రభుత్వ భూములు మరియు ఇతర భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ, భూముల వివరాలను తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ పాల్గొన్నారు
Prajavartha Online Telugu News