-సిఎం చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన సంఘం ప్రతినిధులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో తాము చేసిన పది రోజుల సమ్మె కాలాన్ని డ్యూటీ పీరియడ్ గా పరిగణిస్తూ జీతాల్ని విడుదల చేయడం పట్ల
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం మంగళవారం నాడు ఒక ప్రకటనలో హర్షాన్ని వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు డాక్టర్ ఎం. వినోద్ కుమార్, డాక్టర్ కె. రాహుల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణ బాబును సచివాలయంలో మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్నిచ్చి కృతజ్ఞతలు తెలిపారు. తమ పట్ల సానుకూలంగా వ్యవహరించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె పద్మావతికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News