Breaking News

Daily Archives: November 29, 2024

నారావారి పల్లె నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణం

–సిఎం సోదరుడు మరియు మాజీ ఎంఎల్ఏ రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల ప్రక్రియలు పూర్తి చేసుకుని తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు పయణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నారావారి పల్లె నందు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల ప్రక్రియలు పూర్తి చేసుకుని నేటి శుక్రవారం ఉదయం 11.05 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సాదర …

Read More »

కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు

-అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు -మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌డౌన్‌ చేస్తాం -పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండి -కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నార’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో …

Read More »

పి.సి.ఆర్. లండన్ వాల్వ్ అంతర్జాతీయ వైద్య సదస్సులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్యులకు ప్రశంసలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక వైద్య సాంకేతికతతో గుండె కవాటాలను ఓపెన్-హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ట్రాన్స్‌కాథెటర్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (TAVR) విధానంలో మార్చడం ఇప్పుడు సాధ్యమవుతుంది. ఈ మినిమల్ ఇన్వేజివ్ ప్రక్రియతో,తక్కువ రిస్క్‌తో మరియు వేగంగా కోలుకోవడం సాధ్యమవుతుంది. వృద్ధులు మరియు ఆరోగ్య సమస్యలున్న రోగులకు ఇది అనుకూలంగా ఉంటుంది,ఈ విధానంలో ఓపెన్-హార్ట్ సర్జరీ అవసరాన్ని తొలగించి రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇండియా వాల్వ్స్, పి.సీ.ఆర్. టోక్యో వాల్వ్స్, మరియు పి.సీ.ఆర్.లండన్ వాల్వ్స్ వంటి జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై రమేష్ …

Read More »

పారిశ్రామిక వేత్తలుగా మహిళలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -సొంతూర్లోనే ఆదాయం ఆర్జించేలా యువతకు ప్రోత్సాహం -ఎంఎస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్ల ఏర్పాటు -వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీఐ తరగతులు ప్రారంభం -నేడు(శనివారం) సామాజిక పెన్షన్ల పంపిణీ -మోడల్ పంచాయతీగా రాంపురం అభివృద్ధి : మంత్రి సవిత పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : సొంతూరులో ఉండి యువత ఆదాయం ఆర్జించేలా ఎంఎస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని, మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని …

Read More »

రాయచోటిలో మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయచోటి, అన్నమయ్య జిల్లా ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సమావేశానికి రాయచోటి, అన్నమయ్య జిల్లా మాజీ సైనికులు గురుగింజ బాలాజీ, శివ ప్రసాద్ రాజ్, ఎ. శేఖరయ్య నాయుడు, ఎస్. చలపతి, ఆర్ త్రివిక్రమ్ రాజు, ఆదినారాయణ రెడ్డి, …

Read More »

రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం

-ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలున్నాయి -విజన్ 2047తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం -గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సర్వనాశనమైంది -యువత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి -పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది -కేంద్ర, రాష్ట్ర సబ్సిడీలతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం -విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్‌పో ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా, రాష్ట్ర ఆర్ధిక స్థితి కూడ మెరుగుపడతుందని …

Read More »

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆశాఖ మంత్రి డోలా.బాలవీరాంజనేయ స్వామి కి ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వి.శివా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.పురుషోత్తమనాయుడు, ఎ.విద్యాసాగర్ మరియు రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందించారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా.బాల.వీరాంజనేయ స్వామిని కలిసిన ఎ.పి.యన్.జి.జిఓ ల అగ్ర నేతలు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మంత్రితో అరగంటపాటు చర్చించారు. అనంతరం 22 అంశాలతో కూడిన వినతిపత్రం అందించి సమస్యలు పరిష్కారం చేయాలని,ముఖ్యమంత్రితో జరగనున్న సమీక్ష …

Read More »

ఎపిలో 88 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం

-ఎన్టీఆర్ జిల్లాకు రెండు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు -ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రశ్నకు కేంద్రం బదులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలో మొత్తం 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) లు ఏర్పాటు చేయ‌నుండ‌గా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం ల‌భించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ స‌హాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖితపూర్వక …

Read More »

విద్యా ప్ర‌మాణాల పెంపే ల‌క్ష్యంగా బోధ‌న అందించండి

-సంక్షేమ వ‌స‌తి గృహ విద్యార్థులపై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా ప్ర‌మాణాల పెంపే ల‌క్ష్యంగా బోధ‌న అందించి.. ఫ‌లితాల్లో జిల్లాను అగ్ర‌గామిగా నిలిపేలా కృషిచేయాల‌ని, సంక్షేమ వ‌స‌తి గృహ విద్యార్థుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్దికి తోడ్ప‌డాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత డా. ల‌క్ష్మీశ తొలి క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం స్థానిక శాస‌న‌స‌భ్యులు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు, అధికారుల‌తో క‌లిసి ఎ.కొండూరులోని క‌స్తూరిబా …

Read More »

జూన్ నాటికి ఎ.కొండూరుకు సుర‌క్షిత కృష్ణా జ‌లాలు

-కిడ్నీ వ్యాధుల నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు -వ్యాధి బాధితుల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందిస్తున్నాం -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్ర‌భావిత 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సుర‌క్షిత కృష్ణా జ‌లాల‌ను రానున్న జూన్ నాటికి అందించేలా తాగునీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేస్తున్నామ‌ని, కిడ్నీ వ్యాధుల నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు వ్యాధుల బారిన ప‌డిన బాధితుల‌కు ప్ర‌త్యేక వైద్య స‌హాయం అందించి ప్ర‌భుత్వ ప‌రంగా …

Read More »