విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని ఘంటసాల సంగీత కళాశాల నందు ఆల్ ఇండియా భవానీ దీక్ష ఛారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం శ్రీ దుర్గా భవాని దీక్షా జాతీయ సదస్సు ఆదివారం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా జ్యోతి ని వెలిగించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి,జగన్మాతను కొలవని ఊరుండదు, …
Read More »Daily Archives: December 8, 2024
కంచికచర్ల పట్టణంలోని జుజ్జూరు రోడ్డు శంకుస్థాపన
-ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలియజేశారు. 65 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో కంచికచర్ల పట్టణంలోని జుజ్జూరు రోడ్డు, నూతన రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ చేతులతో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »యువతిపై కత్తిదాడి ఘటన…
-నిందితుడిని వెంటనే అరెస్టు చేయండి -ఇన్చార్జి ఎస్పీకి మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో యువతిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేసిన ఉన్మాది కుళాయప్పను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడును జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ప్రేమించాలంటూ యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే ఇన్చార్జి ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. పరారీలో ఉన్న నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని …
Read More »మైలవరం నియోజకవర్గంలో 50 వేల టీడీపీ సభ్యత్వాలు పూర్తి
-ఉద్యమ స్పూర్తితో టీడీపీ సభ్యత్వ నమోదు -టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి వర్యులు నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో 50 వేల మైలురాయిని దాటింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా …
Read More »డిసెంబర్ 9 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ – మీకోసం
-కలక్టరేట్ లో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రం, ఇతర సేవలు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి “పిజిఆర్ఎస్ – మీ కోసం” కార్యక్రమం డిసెంబర్ 9 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు …
Read More »లోక కళ్యాణం కోసం అమ్మవారికి పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మలగన్న అమ్మ అశీస్సులు తోడై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలని, అన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. శక్తిస్వరూపిణి, సర్వలోకాలకు ఆదిదేవత అయిన దుర్గామాతను శరణు వేడుతూ ఆదివారం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తో కలసి అమ్మకు ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద రామకృష్ణ మాట్లాడుతూ… కష్టకాలంలో అమ్మను శరణు వేడితే, అన్నింటికీ పరిష్కారాలు …
Read More »సభ్యత్వ నమోదులో గిన్నిస్ రికార్డు సృష్టించనున్న తెలుగుదేశం
–టీడీపీలో ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. –11వ డివిజన్‌లో టీడీపీ సభ్యత్వ కార్డులను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య యుతంగా సభ్యత్వ నమోదు నిర్వహించడమే కాకుండా కోటి మందికి సభ్యత్వాలు ఇచ్చి త్వరలో తెలుగుదేశం పార్టీ గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుకోబోతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించే తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉంటూ ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజా సేవ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు సంక్షేమ పథకాలు అందజేస్తాం
-9వ డివిజన్ పర్యటన లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడం తోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో మసీద్ రోడ్డు కాలవ గట్టు చివరి ఏరియా లో 9వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. …
Read More »ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కుటంబంలో ఒక ఎంటర్ ప్రెన్యూర్ ను తయారు చేయటమే ఎంపి కేశినేని శివనాథ్ లక్ష్యం
-టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం -హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమం -మెదట విడతలో వెళ్లనున్న50 మందికి పైగా నిరుద్యోగులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని ఎంటర్ ప్రెన్యూర్ గా తయారు చేసే దిశగా ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువత …
Read More »కళా ఉత్సవ్ 2024-25 రాష్ట్ర స్థాయి పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని విద్యార్థుల సృజనాత్మకతను మరియు కళాత్మక ప్రతిభను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన “కళా ఉత్సవ్” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీలు 2024 డిసెంబర్ 9 మరియు 10 తేదీల్లో విజయవాడలోని పొరంకి నిడమానూరు రోడ్డు లోని వద్ద ఉన్న మురళీ రిసార్ట్స్ ప్రాంగణంలో జరగనున్నాయని డైరెక్టర్, పాఠశాల విద్య వి. విజయ్ రామరాజు తెలియచేశారు. సమగ్ర శిక్షా మరియు రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ (SCERT) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో జిల్లా స్థాయి …
Read More »