కంచికచర్ల పట్టణంలోని జుజ్జూరు రోడ్డు శంకుస్థాపన

-ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్ల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలియజేశారు. 65 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో కంచికచర్ల పట్టణంలోని జుజ్జూరు రోడ్డు, నూతన రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ చేతులతో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం గుంతలు లేని రాష్ట్రంగా మార్చేందుకు రోడ్ల అభివృద్ధికి వేల కోట్లు ప్రభుత్వ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి పాటుపడాల్సిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాలనలో దోచుకోవటం దాచుకోవటం తప్ప రాష్ట్ర ప్రజలకు ఓరగా పెట్టింది ఏమి లేదన్నారు.

గతంలో నందిగామ నియోజకవర్గాన్ని పరిపాలించిన అన్నదమ్ములు నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్నాం అని తమ మాటల గారడీలతో నందిగామ నియోజకవర్గ ప్రజలను ఐదేళ్ల పరిపాలనలో పచ్చిగా మోసం చేశారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సౌమ్య ఎద్దేవా చేశారు. గత పాలకుల హయాంలో అన్ని శిలాఫలకాలు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ రోడ్డు నందు నడవలేని పరిస్థితి నెలకొన్నాయని నా దృష్టికి రావడంతోనే ఈ రోడ్డు నూతన నిర్మాణానికి తక్షణమే ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు.

విజన్ ఉన్న నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నమాట ప్రకారం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల పట్టణ మరియు వివిధ గ్రామాల కూటమి నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *