Breaking News

కళా ఉత్సవ్ 2024-25 రాష్ట్ర స్థాయి పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోని విద్యార్థుల సృజనాత్మకతను మరియు కళాత్మక ప్రతిభను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన “కళా ఉత్సవ్” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీలు 2024 డిసెంబర్ 9 మరియు 10 తేదీల్లో విజయవాడలోని పొరంకి నిడమానూరు రోడ్డు లోని వద్ద ఉన్న మురళీ రిసార్ట్స్ ప్రాంగణంలో జరగనున్నాయని డైరెక్టర్, పాఠశాల విద్య వి. విజయ్ రామరాజు తెలియచేశారు. సమగ్ర శిక్షా మరియు రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ (SCERT) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైన అన్ని యాజమాన్యాల పాఠశాలలలో 9, 10, 11 మరియు 12 తరగతులు చదువుతున్న బాలబాలికలు పాల్గొననున్నారు. ఇందులో మొత్తం ఆరు కళారూపాలు సంగీతం – గాత్ర, వాద్య సంగీతాలు, నృత్యం – శాస్త్రీయ, జానపద నృత్యాలు, నాటక కళారూపాలు – మైమ్, మోనో యాక్షన్ వంటివి, దృశ్య కళారూపాలు – 2 D,3 D కళారూపాలు మరియు సాంప్రదాయ కథ రీతి లలో వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో పోటీలు నిర్వహించబడతాయి. రాష్ట్ర స్థాయిలో ప్రతి విభాగంలో ప్రధమ స్థానం సాధించిన విజేతలు జనవరి 2-7 వరకు భోపాల్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *