-ఫిబ్రవరి 1 నుండి 3 వరకు కాకినాడలో క్రీడ పోటీలు -ఏపీ స్టేట్ మాస్టర్స్ అధ్లెటిక్ చాంపియన్ షిప్ 2024-25 గోడపత్రిక ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్ట వ్యాప్తంగా క్రీడా పోటీలు విరివిగా జరగాలని క్రీడల వెైపు అన్నీ వయస్సుల వారు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలలో ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ వారు ఫిబ్రవరి 01 నుంచి 03 వరకు నిర్వహిస్తున్న 23 …
Read More »Monthly Archives: December 2024
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1 కోటి విరాళం ఇచ్చిన ఇందుపల్లికి చెందిన విజయలక్ష్మి
-తన తల్లి కోగంటి ఇందిరాదేవి పేరిట రాజధాని కోసం రూ.1 కోటి విరాళం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1 కోటి విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదారాబాద్ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో రూ.1 కోటి విరాళంగా …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్టు లెక్చరర్లుగా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. శాంక్షన్డ్ పోస్టుల్లోనే తాము సంవత్సరాల తరబడి పని చేస్తున్నామని, అతి తక్కువ జీతాలతో ఇస్తూ తమ శ్రమను …
Read More »మానవ ప్రాణ శక్తి కేంద్రాలపై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో సెయింట్ జోన్స్ ఒకేషనల్ జూనియర్ కాలేజి ఆవరణలో మానవ ప్రాణ శక్తి కేంద్రాలు మరియు యోగ శక్తి చికిత్సపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్పా భారత జాతీయ ప్రధాన కార్యదర్శి డా. మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి బ్రతకటానికి చావడానికి ముఖ్వ కారణం ప్రాణశక్తి అని దానిని పెంపొందించుకోవడానికి మనలోనే అనేక ప్రాణ శక్తి కేంద్రాలు వున్నాయని వాటిని క్రమం తప్పక వాడుకునే …
Read More »జిల్లాలో నేటి నుండి సజావుగా పత్తి కొనుగోలు
-అయిదు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు -జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, మైలవరం మార్కెట్‌యార్డుల్లోనూ కొనుగోలు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విధంగా జిల్లాలో అయిదు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభించిందని.. ప్రజాప్రతినిధులు అభ్యర్థన, రైతుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బుధవారం నుంచి జగ్గయ్యపేట, కంచికచెర్ల, నందిగామ, మైలవరం మార్కెట్‌యార్డుల్లోనూ కొనుగోళ్లు జరగనున్నాయని …
Read More »ఆంధ్రప్రదేశ్ ‘సమగ్ర శిక్షా’ కు జాతీయ అవార్డు
-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘దివ్యాంగుల హక్కుల చట్టం, దివ్యాంగుల కోసం ఇతర పథకాల అమలులో ఉత్తమ రాష్ట్రం’గా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షాకు జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అందుకున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దిల్లీలో మంగళవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు …
Read More »ఫైబర్ నెట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచన
– చైర్మన్ జీవి రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జీవి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ను వెలగపూడి సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఫైబర్ నెట్ లో జరిగిన, జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలిపారు.. పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ …
Read More »స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
– విభిన్న ప్రతిభావంతులకు అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తాం – సదరం సర్టిఫికెట్ల జారీ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు – రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని.. తమతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం స్వయం ఉపాధికి ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ …
Read More »లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల అవగాహనా కార్యక్రమాలు
-రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం 25.11.2024 నుండి 10.12.2024 వరకు “లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల అవగాహనా కార్యక్రమాలు” రూపొందిoచినందున మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD)ఆదేశాలకు అనుగుణంగా జాతీయ మహిళా కమిషన్ (NCW)న్యూఢిల్లీ సహకారంతో కొన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి రాష్ట్ర మహిళా కమిషన్‌లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ 10 డిసెంబర్ 2024 న విజయవాడలోని …
Read More »