Breaking News

ఫైబర్ నెట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచన

– చైర్మన్ జీవి రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జీవి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ను వెలగపూడి సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఫైబర్ నెట్ లో జరిగిన, జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలిపారు.. పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఏపీ ఫైబర్ నెట్ సేవలను రాష్ట్రంలో విస్తృత పరచాలని సూచించారన్నారు. అలానే కనెక్టివిటీని పెంచుతూ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని సూచించారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించాలని దానికి ప్రణాళిక రూపొందించాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *